KR Vijaya: ఎఫైర్ల గుట్టు విప్పిన కేఆర్ విజయ.. ఏం చెప్పారంటే?

KR Vijaya: ఒంపు సొంపుల ఆకారం, ఆరడుగుల ఎత్తు అలా చూస్తూ ఉండాలని అనిపించే అందం తన సొంతం. తనే అలనాటి నటి కేఆర్ విజ‌య‌. ఆవిడ నటిస్తే చాలు సినిమా హిట్టే అని అనుకునే అంత పాపులారిటీ తన సొంతం. విజయ సినిమా అంటే తెలుగు సినీ ప్రేక్షకులు వరుసల్లో నిలబడి మరీ సినిమాకి వచ్చేవారు. అయితే నిజానికి విజయ తెలుగు నటి కాదు. తనది తమిళ్. కానీ ఆమె నటించిన తెలుగు సినిమాలు మంచి విజయాలు సాధించి, తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీనితో తెలుగులో మంచి ఫేమస్ అయ్యింది విజయ.

 

మొదటగా.. శోభ‌న్‌బాబుతో విజయ న‌టించిన ప్రేమ క‌ధా చిత్రాలు బాగా హిట్ట‌య్యాయి. ఇక ఆ తర్వాత ఒక ద‌శ‌లో భ‌క్తి ప్ర‌ధాన‌మైన సినిమాల్లో న‌టించి, తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి ఇంటికి చేరువై.. ఇల‌వేల్పుగా పేరుపొందారు. అప్పట్లో భక్తిర‌స చిత్రాల్లో అమ్మవారు పాత్ర‌లు వేయాలంటే కేఆర్‌ విజయ తర్వాతే ఎవరైనా. ఇదిలా ఉండగా, ఆమె అందం.. అభిన‌యంతో ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక ఆమెకు పాపులారిటీ పెరగగా.. ఆమె గురించి ఎఫైర్లపై ఎక్కువ‌గా చ‌ర్చలు జ‌రిగేవి.

 

విజ‌య ఒకసారి మాట్లాడుతూ “న‌న్ను ఎక్కువ‌గా ఇదే ప్ర‌శ్న అడుగుతుంటారు. మీకు ఎఫైర్లు ఉన్నాయా? అని! కానీ, సినీ ఫీల్డ్‌లో నాకు ఎలాంటి ఎఫైర్లు లేవు. అయితే.. నేను న‌టించిన సినిమా చూసిన ఒక పారిశ్రామిక వేత్త న‌న్ను క‌లిసేందుకు ఇంటికి వ‌చ్చారు. తొలి చూపులో ఆయ‌న న‌న్ను ప్రేమించాన‌ని చెప్పారు. ఆయ‌న అంత ధైర్యంగా ఇంటికి వ‌చ్చి చెప్పేస‌రికి ఆశ్చ‌ర్య పోయా. త‌ర్వాత‌.. మా పెద్ద‌వాళ్ల‌తో మాట్లాడి ఆయ‌న న‌న్ను పెళ్లి చేసుకున్నారు” అని వివ‌రించారు.

 

కేఆర్ విజ‌య భ‌ర్త.. తాను చెప్పిన‌ట్టు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. స‌క‌ల వ‌స‌తుల‌తో ఓ పెద్ద బంగ‌ళా ఆమె కోసం క‌ట్టించారు. ఇంట్లో హెలిప్యాడ్‌ కూడా ఏర్పాటు చేయడమే కాక తనకోసం 30 కార్లు కొనిపెట్టార‌ట‌. అప్పటి రోజుల్లో సొంత ఫ్లైట్ ఉన్న ఏకైక హీరోయిన్‌గా విజయ రికార్డు సృష్టించారు. ఇక తర్వాత రోజుల్లో ఆయన అనారోగ్యానికి గురి అయ్యాక అన్ని అమ్మేసి ఒక చిన్న ఇల్లు తీసుకుని ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో విజయ చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -