Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇవ్వబోతున్న క్రిష్.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమళ్ళు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ క్రిష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. అప్పుడెప్పుడో వకీల్ సాబ్ సినిమా సమయంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా ఇప్పటికీ ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల షూటింగ్స్ కి హాజరవుతూ హరిహర విరమణ సినిమాను పక్కన పెట్టేసాడు.

ఈ చిత్రం ఆలస్యం అవ్వడానికి కారణం పవన్ వేరే సినిమాల షూటింగ్స్ కి కమిట్ అయ్యి వాటికే ముందు ప్రాముఖ్యత ఇవ్వడం మరో కారణం. భీమ్లా నాయక్ సినిమా కోసం చాలా డేట్స్ ఇచ్చేసాడు. ఆ తర్వాత చాలా కాలం షూటింగ్స్ కి విరామం ఇచ్చి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. సుమారుగా రెండు నెలల పాటు విరామం లేకుండా ఇంటర్వెల్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆయన బ్రో మూవీ షూటింగ్ లో పాల్గొని ఆ సినిమాని పూర్తి చేసాడు.ఆ తర్వాత కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ని ప్రారంభించి మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసాడు.

 

ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే OG మూవీ షూటింగ్ కి డేట్స్ ఇచ్చేసాడు. ఇలా వీరమల్లు సినిమా కంటే ఆలస్యంగా కమిట్ అయినా సినిమాలను తొందరగా పూర్తి చేస్తున్న పవన్ హరిహర వీరమల్లు సినిమాను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ప్రాజెక్టు పట్ల తీవ్ర అసహనానికి గురైన క్రిష్ మరో ప్రాజెక్ట్స్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. బాలీవుడ్ లో ఒక క్రేజీ స్టార్ హీరోతో రీసెంట్ గా చర్చలు కూడా పూర్తి అయ్యినట్టు సమాచారం. మరి క్లైమాక్స్ భాగం తప్ప షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న హరి హర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసి వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడా, లేదా ముందుగానే ఆ ప్రాజెక్ట్ కి వెళ్లిపోనున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపుల వల్ల సూసైడ్ చేసుకున్న మహిళ.. ఏం జరిగిందంటే?

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది బెదిరింపులు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం లేకుండా బెదిరింపులకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఓ...
- Advertisement -
- Advertisement -