Krishna: కృష్ణ మృతిపై మేకప్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Krishna: ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో సినిమాలలో నటించి తిరుగులేని నటుడుగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా నిలిచిన కృష్ణ.. తన సినిమాల విషయంలో ఎవరు సొంతం చేసుకోలేని రికార్డు తాను సొంతం చేసుకున్నాడు. వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు కృష్ణ. అంతేకాకుండా అంతకు రెట్టింపు అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు.

 

అయితే ఈయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడగా ఇటీవలే ఈ లోకాన్ని వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈయన మరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు అసలు తట్టుకోలేక పోయారు. ఇప్పటికీ ఈ విషయాన్ని తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఏడాది వరుస మరణాల వార్తలు విని శోకసంద్రంలో మునిగిపోయింది.

 

ఇక ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆయన కుటుంబ సభ్యుల కాదు ఆయనతో నటించిన నటీనటులు, ఆయన దగ్గర పని చేసిన వ్యక్తులు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు కూడా కృష్ణ గురించి చాలా విషయాలు పంచుకున్నాడు. ఇక ఆయన చాలా మంచి నటుడు అంటూ.. అంతేకాకుండా ఆయనతో బాగా సన్నిహితంగా ఉంటాను అంటూ తెలిపాడు.

 

వ్యక్తిగతంగా ఆయన, ఆయన భార్య విజయనిర్మల చాలా మంచివారు అంటూ.. ఎంతోమందికి సహాయం చేశారు అని తెలిపాడు. ఇక కృష్ణ చనిపోయాక కూడా మేకప్ వేశాను అని అన్నాడు. ఆయన చనిపోయాక స్నానం చేయించి ఆయనను తయారు చేసినట్లు తెలిపాడు మాధవరావు. అంతేకాకుండా కృష్ణ గురించి మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -