Krishna: మహేష్ చేయలేని పని గౌతమ్ చేస్తున్నాడా?

Krishna: భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన సూపర్‌స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని కలచివేసింది. కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలిసి ఆయన కుటుంబ సభ్యులతోపాటు ఘట్టమనేని ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. మహేష్ బాబు అయితే తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు.

 

మహేష్ బాబు ఈ సంవత్సరం ముగ్గురు ఆప్తులను కోల్పోయారు. ఒక ఏడాది కాలంలో ఆయన కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అన్న రమేశ్ బాబును కోల్పోయిన బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో తల్లి ఇందిర మృతి మహేష్‌ను కలచివేసింది. ఆ బాధ నుంచి తేరుకునే లోగా తండ్రి కృష్ణ చనిపోవడంతో మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

అన్నదానం చేయనున్న సితార
తీవ్ర బాధలో కూరుకుపోయినప్పటికీ తన తండ్రికి సంబంధించిన కార్యక్రమాలను అన్నింటినీ మహేష్ పూర్తి చేస్తున్నారు. మరోవైపు మహేష్ పిల్లలు కూడా తమ తాత జ్ఞాపకంగా ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు. సితార అనాథ పిల్లలకు వారంలో ఒక రోజు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు.

 

ఘట్టమనేని అభిమానులు గర్వపడేలా..!
ఇప్పుడు గౌతమ్ ఘట్టమనేని కూడా సెన్సేషనల్ డెసిజన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణ చదువుకున్న కాలేజీని అభివృద్ధి చేసే ఆలోచనలో గౌతమ్ ఉన్నారట. తన దగ్గర ఉన్న కొంత డబ్బుతోపాటు నాన్న మహేష్ నుంచి మరికొంత మొత్తాన్ని తీసుకుని ఆ కళాశాలను అభివృద్ధి చేసే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఘట్టమనేని అభిమానులు గౌతమ్ చేస్తున్న పనిని చూసి గర్వపడతారు.

 

ఇకపోతే, మహేష్ బాబు ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతంఓది. దీని చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే కాలికి ఇంజ్యురీ కావడంతో షూటింగ్ వాయిదా పడింది. అలాగే తండ్రి మరణంతో మహేష్ బాధలో ఉండటంతో ఎస్ఎస్ఎంబీ 28 షూట్ రీస్టార్ట్ అయ్యేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: ఒక్క ఛాన్స్ కు ఇక నో ఛాన్స్.. 2024 ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు జోస్యం నిజం కానుందా?

Chandrababu: ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చంద్రబాబులో ఎప్పడూ కనిపించనంత ఉత్సాహం కనిపిస్తుంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఆయన ఒక్క చాన్స్ ప్రభుత్వానికి.. ఇక నో ఛాన్స్ అని చంద్రబాబు ట్వీట్ చేశారు....
- Advertisement -
- Advertisement -