Krishnam Raju: కృష్ణరాజు మంచితనం ఎంత గొప్పదో.. ఇంతకు అసలు విషయం ఏంటంటే?

Krishnam Raju: టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి అగ్రస్టార్ హీరో కృష్ణంరాజు గురించి పెద్దగా పరిచయం ఒక్కట్లేదు. అయన ఇండస్ట్రీలో విలన్ గా హీరోగా నటించి నటనలో తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. కేవలం నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా చాలా సినిమాల నిర్మించాడు కృష్ణంరాజు. మొదట కృష్ణంరాజు విలన్ పాత్రలు చేసి ఆ తర్వాత తన టాలెంట్ తో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

అలా ఇండస్ట్రీలో పలు సినిమాలో హీరోగా నటించిన అగ్రస్టార్ హీరోగా ఎదిగాడు. అప్పట్లో కృష్ణంరాజు బాగా రెబలియన్ కు సంబంధించిన సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా ఒక బ్రాండ్ ను తన సొంతం చేసుకున్నాడు. కృష్ణంరాజు కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా తనకంటూ కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కేంద్ర మంత్రిగా ఎన్నికై ఈ రాష్ట్రానికి తన సేవలు అందించాడు. అటువంటి మహానీయుడు ఇటీవలే అనారోగ్యం కారణంగా మరణించాడు.

హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు కన్నుమూశారు. కృష్ణంరాజు మరణం వార్తలు తన అభిమానులు ఈరోజు వరకు కూడా ఏ మాత్రం తీసుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు చనిపోయిన రోజు బీజేపీ నాయకులు కృష్ణంరాజు పార్దివ దేహం దగ్గర బీజేపీ జెండాను ఆ పార్టీ కృష్ణంరాజును తన సొంతం చేసుకుంది. ఇక ఇదంతా పక్కన పెడితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణంరాజు తనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తాను ఏదైనా హోటల్ కి వెళ్తే అక్కడ అందరూ తనతో మాట్లాడడానికి వచ్చేవారట.

దాంతో కృష్ణంరాజు ఆ హోటల్ కి వచ్చిన వారందరి బిల్లు ను తానే కట్టేవాడట. దాంతో ఆ హోటల్ యజమాని కూడా ఆశ్చర్యపోయేవాడని, అప్పటినుంచి ఆ హోటల్ యజమాని నన్ను మంచిగా గౌరవించేవాడని కృష్ణం రాజు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏదేమైనా టాలీవుడ్ కి కృష్ణంరాజు చనిపోవడం తీరని లోటుగా మారిపోయింది. సినీ రాజకీయ వర్గాలు ఈరోజు వరకు కూడా కృష్ణంరాజు మరణం వార్తను ఏ మాత్రం తీసుకోలేకపోతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -