Krishnam Raju-Chiranjeevi: చిరంజీవి గురించి షాకింగ్ విషయాలు పెట్టిన కృష్ణంరాజు.. ఇంతకు అవేంటంటే?

Krishnam Raju-Chiranjeevi: తెలుగు ప్రేక్షకులకు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. మొదట విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అనంతరం తన టాలెంట్ తో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృష్ణంరాజు టాలీవుడ్లో అగ్రస్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఒక కృష్ణంరాజు నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా సినిమాలు నిర్మించాడు. అప్పట్లో బాగా రెబలియన్ సినిమాలు చేస్తూ రెబల్ స్టార్ గా ఒక బ్రాండ్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా కృష్ణంరాజు తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. కేంద్ర మంత్రిగా తెలుగు ప్రజలకు తన సేవలను అందించాడు. ఇటువంటి మహానీయుడు ఇటీవల హైదరాబాదులో ఏఐజి ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా మరణించాడు.

ఈ విషయాన్ని కృష్ణంరాజు అభిమానులు ఈరోజు వరకు తీసుకోలేకపోతున్నారు. సినీ రాజకీయ వర్గాలు కృష్ణంరాజు మరణ వార్త విషయంలో మొత్తం మూగపోయాయి. ఇదంతా పక్కన పెడితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణంరాజు మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిపాడు. ఆ ఇంటర్వ్యూలో మెగాస్టార్ గురించి చిరంజీవి మా ఊరి వాడే. మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవికి నేనే క్యారెక్టర్ ఇచ్చాను.

ఆ సినిమా బాగా హీట్ అయింది. అంతేకాకుండా చిరంజీవి వాళ్ళ అమ్మగారు ఎప్పుడూ నువ్వు కృష్ణంరాజు లా అవ్వాలి రా అనేదట. ఈ విషయం కృష్ణంరాజు గారికి చిరంజీవి చెప్పాడని రెబల్ స్టార్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హడావిడిగా మారింది. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగు వెలిగిన రెబల్ స్టార్ ఇప్పుడు కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -