Krishnam Raju: అప్పట్లో ప్రభాస్ కి కృష్ణంరాజు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?

Krishnam Raju:  టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి పెద్దగా పరిచయంకర్లేదు. అప్పటి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి.. ఆ తర్వాత హీరో స్థాయికి ఎదిగాడు కృష్ణంరాజు. అలా ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాల్లో నటించి అగ్రస్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక కృష్ణంరాజు నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా చాలా సినిమాలు నిర్మించాడు.

అటువంటి మహానీయుడు ఇటివలె హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు అభిమానులు ఈరోజు వరకు కూడా తీసుకోలేకపోతున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే అప్పట్లో కృష్ణంరాజు తాండ్ర పాపారాయుడు సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు గాను కృష్ణంరాజు 2006లో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు.

అయితే ఈ సినిమాకు ప్రభాస్ కు విడదీయలేని ఒక అనుబంధం ఉందట. ప్రభాస్ యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు బొబ్బిలి బ్రహ్మన్నను చూసి డైలాగులు ప్రాక్టీస్ చేసేవాడట. దాదాపు పది సంవత్సరాలపాటు బొబ్బిలి బ్రహ్మన్న డైలాగులు మర్చిపోలేదట ప్రభాస్. ఏ సీరియస్ డైలాగ్ చెప్పేటప్పుడైనా సరే కృష్ణంరాజు లా ప్రభాస్ డైలాగులు చెప్పేవాడట. ఇదంతా మొదటి సినిమాలోనే గమనించిన కృష్ణంరాజు ప్రభాస్ కి ఈ విధంగా సలహా ఇచ్చాడట.

డైలాగ్ ను నెమ్మదిగా శ్వాస వదులుకుంటూ చెప్పాలని కృష్ణంరాజు ప్రభాస్ కి సలహా ఇచ్చాడు. ఇక ప్రభాస్ కూడా సరే పెదనాన్న అని ఆ విధంగా డైలాగులు చెప్పడం ప్రాక్టీస్ చేశాడట. అలా ప్రభాస్ తన పెద్దనాన్నని ఫాలో అవటంతో ప్రస్తుతం కృష్ణంరాజు లెవెల్లో వెలుగుతున్నాడు. టాలీవుడ్ లో మరో రెబల్ స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. త్వరలో వరల్డ్ వైడ్ గా సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు కే జి ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -