KrishnamRaju: కృష్ణంరాజు రెండో భార్య గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

KrishnamRaju: లెజండరీ యాక్టర్, రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించారు. తెలుగు కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. దాదాపు 183 సినిమాల్లో నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు.. కొద్దిరోజుల క్రితమే స్వర్గీయులైన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తనకంటూ ప్రత్యేక మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. క్రేజ్, ఫ్యాన్ ఫాలొయింగ్ విషయంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌పై ఏకంగా రూ.3 వేల కోట్ల బిజినెస్ జరిగే సినిమా జరుగుతున్నాయని టాక్.

 

కృష్ణంరాజు కూడా అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. అయితే కృష్ణంరాజు వ్యక్తిగత విషయానికి వస్తే.. అతని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రెబల్ స్టార్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1969లో కృష్ణంరాజుకు మొదటగా సీతాదేవితో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దాంతో వీరు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారు. దురదృష్టవశాత్తు సీతాదేవికి 1995లో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణంరాజు ఏడాదిపాటు ఒంటరయ్యాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల బలవంతంతో 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో వివాహం జరిగింది. శ్యామలాదేవిది సంప్రదాయ రాజుల కుటుంబం. అయితే వయసు విషయంలో కృష్ణంరాజు కంటే చాలా చిన్నామే. వీరిద్దరికి పెళ్లైనప్పుడు ఏజ్ గ్యాప్ ఏకంగా 28 ఏళ్లు ఉందట. శ్యామలాదేవి-కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. వీరి పేర్లు ప్రసీది, ప్రదీప్తి, ప్రకీర్తి. కాగా, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో.. ‘సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్’ సినిమాలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -