Krishnudu: సినీ పరిశ్రమలోకి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. అయితే కొందరు మాత్రమే ఎన్ని కష్టనష్టాలు, గెలుపోటములు వచ్చిన ఎదురొడ్డి పోరాడి నిలబడతారు. అలా నిలబడ్డ వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అయితే కొందరు మాత్రం కాలం కలసిరాక, అవకాశాల్లేక రేసులో వెనుకపడి తెరకు దూరమవుతారు. నటించే సత్తా ఉన్నా చాన్సుల్లేక కళామతల్లికి దూరమైన వాళ్లెందరో ఉన్నారు. ఇక, చిన్న చిన్న పాత్రలతో తెలుగు పరిశ్రమలో నటుడిగా కెరీర్ ను ప్రారంభించారు కృష్ణుడు.
‘హ్యాపీ డేస్’ మూవీతో పేరు తెచ్చుకున్న వారిలో కృష్ణుడు ఒకరు. సీనియర్ గా క్రికెట్ మ్యాచ్ సమయలో అతడు చేసే కామెడీకి థియేటర్లలో ఆడియెన్స్ నవ్వాపుకోలేకపోయారు. జూనియర్స్ ను వేధించే బ్యాచ్ లో ఒకడిగా ఆయన తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు. దీంతో ఆయనకు ‘వినాయకుడు’ మూవీలో హీరోగా ఆఫర్ వచ్చింది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘వినాయకుడు’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో తనదైన నటనతో ప్రేక్షకుల్లో యాక్టర్ గా మంచి పాపులారిటీ సంపాదించారు కృష్ణుడు. ‘వినాయకుడు’ సక్సెస్ అనంతరం ‘విలేజ్ లో వినాయకుడు’, ‘పప్పు’ ఇలా మరికొన్ని చిత్రాల్లో కృష్ణుడు కథానాయకుడిగా యాక్ట్ చేశారు. అయితే అవేవీ అంతగా హిట్టవ్వలేదు.
సినిమాలకు దూరంగా ఉంటున్న కృష్ణుడు
‘విలేజ్ లో వినాయకుడు’ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. రావు రమేష్, యండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్లు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇలా పలు సినిమాల్లో నటిస్తూ వచ్చిన కృష్ణుడు.. ఇటీవల చిత్రాలకు బ్రేక్ ఇచ్చారు. ఆయనకు అవకాశాలు తగ్గినట్లు సమాచారం.
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీకి కృష్ణుడు దూరంగా ఉంటున్నారని వినికిడి. కాగా, ఆయన తన కూతురు ఓణీల వేడుకను హోటల్ దస్ పల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరవ్వడం విశేషం. కృష్ణుడు కూతురి పేరు నిత్య అని తెలుస్తోంది. ఈ పాప క్యూట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసిన నెటిజన్స్ చాలా అందంగా ఉందని పొగుడుతున్నారు. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లిన కృష్ణుడు.. ఆ తర్వాత ఎందుకో సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.