Krithi Shetty: చివరికి తండ్రితో కూడా మాటలు పడిపించుకున్న కృతి శెట్టి!

Krithi Shetty: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల భామ కృతి శెట్టి గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో కృతి శెట్టి ఎంతోమంది కుర్రాళ్ల మతులు పోగొట్టింది.

మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అనంతరం హీరో నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ ముద్దుగుమ్మ కు ఊహించని స్థాయిలో సక్సెస్ ను అందించి పెట్టింది. అంతేకాకుండా ఈ సినిమాకు పారితోషికం కూడా కొంచెం పెద్ద మొత్తంలో తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి టాలీవుడ్ లో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ఈ అమ్మడు మరో సినిమా నాగచైతన్య తో కలిసి.. బంగార్రాజు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా కృతికి మరో స్థాయిలో సక్సెస్ ను తెచ్చి పెట్టింది. అప్పటినుంచి డైరెక్టర్లు కృతి శెట్టి వెంట పడడం మొదలుపెట్టారు. ఇక రెమ్యూనరేషన్ కూడా కాస్త పెంచినట్లు తెలుస్తుంది. కానీ అప్పుడే కృతికి బాడ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. హీరో రామ్ తో కలిసి ది వారియర్ అనే సినిమాలో నటించింది.

కానీ ఈ సినిమా పూర్తిగా.. కృతి శెట్టిని డౌన్ చేసింది. భారీ స్థాయిలో పరాజయం పాలయింది. ఇక ఇదే క్రమంలోని నితిన్ తో కలిసి తీసిన.. మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా భారీ స్థాయిలో ఓటమిని చవి చూసింది. దాంతో కృతి శెట్టి క్రేజ్ భారీ స్థాయిలో కిందకు పడిపోయినట్లు తెలుస్తుంది. ఇక తన పర్ఫామెన్స్ చూసిన కృతి తండ్రి తనకు వార్నింగ్ ఇచ్చాడట.

నీలో రాను.. రాను నటనపై ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇలా చేస్తే నీకు సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రావు. నీ కెరీర్ మొత్తం పడిపోతుంది. ఇలా అయితే నువ్వు అనుకున్నది సాధించలేవు. బాగా కష్టపడాలి అని కృతికి తన తండ్రి వార్నిగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -