Krithi Shetty: ఆ పని చేయడం వల్లే కృతిశెట్టికి మూవీ ఆఫర్లు వస్తున్నాయా?

Krithi Shetty: అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకున్న వారిలో నటి కృతి శెట్టి ఒకరు. 2021లో ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధలు కొట్టింది. ఓవర్‌నైట్‌లోనే కృతి శెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. తన సెకండ్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోగా న్యాచురల్ స్టార్ నాని నటించాడు. ఆ తర్వాత సినిమా ‘బంగార్రాజు’ కూడా బిగ్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య, నాగార్జున హీరోలుగా నటించారు.

 

 

అయితే వరుసగా మూడు సినిమా మంచి హిట్ అందుకోవడంతో.. కృతి శెట్టికి తిరుగు లేకుండా అయింది. గోల్డెన్ లెగ్‌గా దర్శక నిర్మాతలు భావించడం మొదలు పెట్టారు. దాంతో కృతికి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత కృతి హీరోయిన్‌గా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేకపోయాయి. దాంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గడం మొదలు పెట్టాయి. కెరీర్ ప్రారంభంలో ఎంతో సంప్రదాయంగా కనిపించిన ఈ భామ.. ఆ తర్వాత గ్లామరస్ పాత్రల్లో నటించడానికి కూడా సిద్ధమైంది. గ్లామర్ డోస్ పెంచి కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. అందరి కళ్లను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. కృతి శెట్టి నటించిన వరుస మూడు సినిమాలు ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలో ఆఫర్స్ రావడానికి ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయట్లేదని తాజాగా ప్రచారం జరుగుతోంది. అలాగే దర్శకనిర్మాతలు చెప్పిన విధంగా నడుచుకుంటోందని, అందుకే ఈ భామకు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కృతి శెట్టికి ఉన్న డెడికేషన్‌కు దర్శకనిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -