Krithi Shetty: బుద్ధున్న హీరోయిన్ ఎవరూ కృతిశెట్టిలా చేయరు!

Krithi Shetty: గోల్డెన్ లెగ్‌గా మంచి పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్‌లలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఒకరు. వరుసగా మూడు సినిమాలు హిట్ అవ్వడంతో కెరీర్ పరంగా వెనక్కి తిరగకుండా దూసుకెళ్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. వరుస సినిమాలు సక్సెస్ అవ్వడంతో కృతి శెట్టిని నిర్మాతలు గోల్డెన్ లెగ్‌గా పూజిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోలైన నితిన్, సుధీర్ బాబు, రామ్‌లతో కలిసి ఆయా సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈ భామ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రేక్షకులు ఆమెను మర్చిపోకుండా ఉండాలని సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కన్నడ బ్యూటీ కృతి శెట్టి తెగ ఓవర్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకున్న కృతిశెట్టి.. ఇటీవల బాలీవుడ్‌లోనూ అవకాశాలు వచ్చాయి. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సమయంలోనే ఆ ఆఫర్ వచ్చిందట. కానీ అప్పుడు ఆ ఆఫర్‌ను ఈ భామ ఓపెన్‌గానే రిజెక్ట్ చేసింది.

అయితే అప్పటికే టాలీవుడ్‌లో కృతి శెట్టి మంచి డిమాండ్‌తో ఉంది. ప్రజెంట్ ఆ పరిస్థితి లేదు. అలాంటి సమయంలో బాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే.. బుద్ధున్న ఏ హీరోయిన్ ఆ ఆఫర్‌ను వదులుకోదు. కానీ కృతి శెట్టి మాత్రం ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది. అయితే ప్రస్తుతం కృతి శెట్టి టాలీవుడ్ ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేయడంతో కృతి శెట్టి నిర్ణయానికి సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది. అయితే వాస్తవానికి ఏ హీరోయిన్ ఒకే ఇండస్ట్రీపై డిపెండ్ అవ్వకూడదు. ఒక వేళ డిపెండ్ అయితే.. అనుకున్నది సాధించలేరు. అన్ని భాషల్లోనూ పాపులారిటీని సంపాదించుకోవాలి. కాజల్, సమంత, తాప్పీ, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందనా వంటి నటీమణులు తెలుగు, కన్నడ, తమిళ, ఇతర భాషల్లో నటిస్తూ మంచి క్రేజ్, పాపులారిటీని సంపాదించుకున్నారు. అప్పటి స్టార్ నటీమణులు కూడా అలా గుర్తింపు తెచ్చుకున్నవారే. కెరీర్ డల్‌గా కొనసాగుతున్న సమయంలో.. కృతి శెట్టి తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తన డిసిజన్‌ మార్చుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -