Kriti Kharbanda: ఈ హీరోయిన్ చేసిన పని తెలిస్తే అసహ్యించుకోవాల్సిందే!

Kriti Kharbanda: హీరోయిన్లకు అవకాశాలు రావడం అనేది అదృష్టం, వాళ్ల ట్యాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు దశాబ్దాల పాటు వెండి తెర మీద తమ చరిష్మాను కొనసాగిస్తే, మరికొందరు మాత్రం కొద్దికాలం మాత్రమే తమ హవాను కొనసాగిస్తుంటారు. ఇక అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ చాలామంది హీరోయిన్లు కనుమరుగవుతుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు ఈ మధ్యన సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.

 

తెలుగుతో సహా పలు భాషలకు చెందిన హీరోయిన్లు ఈ మధ్యన సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. హాట్ ఫోటోలు లేదంటే వివాదాస్పద ఫోటోలు లేదంటే వీడియోల ద్వారా చాలామంది హీరోయిన్లు ఎప్పుడూ నెటిజన్ల నోళ్లలో నానుతూ ఉంటున్నారు. తెలుగులో కూడా ఒకప్పుడు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకొని, వర్కవుట్ కాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసిన హీరోయిన్ ఫోటోలు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి.

 

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘తీన్మార్’ సినిమాలో కనిపించిన హీరోయిన్ కృతి కర్బంద సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు ఇప్పుడు రచ్చకు కారణమయ్యాయి. కృతి కర్బంద తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేయగా.. వాటిని చూసిన జనాలు.. ఇదెక్కడి విడ్డూరం అంటూ తిట్టుపోస్తున్నారు. కృతి కర్బంద తన కుక్కతో ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వీటిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 

కుక్కతో లిప్ లాక్ ఏంటి అంటూ అందరూ కృతి కర్బంద పెట్టిన ఫోటోల మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సినిమాలు లేకపోవడంతో కృతి మైండ్ దొబ్బిందని అందుకే ఆమె ఇలా చేస్తోందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పబ్లిసిటీ కోసం మూగజీవాలను ఇలా హింసిస్తావా అంటూ మరికొందరు కృతి మీద మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మరింత రెచ్చిపోయి బూతులు తిడుతూ.. ఇంకా నయం.. ముద్దు వరకు సరిపెట్టింది అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అమ్మడు పెట్టిన ఫోటోల వల్ల మరోసారి అమ్మడి పేరు నెట్టింట మారుమోగుపోయింది.

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -