Krithi Shetty: చెప్పలేని బూతుమాట మాట్లాడిన కృతి.. ఇంత ఘోరమా?

Krithi Shetty: కృతి శెట్టి.. అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో మంచి క్రేజ్, పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ల వరుసకు చేరింది. వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటించేందుకు ఛాన్సులు కొట్టేస్తోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ పేరు తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కృతి శెట్టి నోట బూత మాట వచ్చినట్లు ఇంటర్నెట్‌లో ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ అమ్మడు బూతులెందుకు మాట్లాడింది? ఆ మాట తన నోటి వెంట ఎందుకు వచ్చింది? అసలు ఎవర్ని తిట్టింది? ఎక్కడ.. ఎప్పుడు అన్నది? అనే ప్రశ్నలు నెటిజన్లను మదిలో మెదులుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన హాట్ ఫోటోలతో మరింత రెచ్చిపోతోంది. రెండు సినిమాల సక్సెస్‌తో మంచి ఊపు మీద ఉన్న ఈ భామ.. కథ డిమాండ్ చేస్తే తన అందాలను ఆరబోయడానికి కూడా సిద్ధమని తెలుస్తోంది. స్పైసీ సీన్స్ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉంటున్నట్లు సమాచారం. ‘ఉప్పెన, శ్యామ్ సింగ్‌రాయ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేసిన ఈ అమ్మడు.. దానికి మించిన రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్తోంది. అలా వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తోంది.

 

 

కృతి శెట్టి తన ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే మొదట్లో కాస్త పద్ధతిగా కనిపించిన కృతి ఇప్పుడు డోస్ పెంచినట్లు కనిపిస్తోంది. స్పైసీ కంటెంట్‌కు కూడా ఓకే చెప్పడంతో స్టార్ హీరోలు తమ సినిమాల్లో నటించేందుకు సుముఖత చూపుతున్నారట. బాలీవుడ్‌లో ‘సూపర్ 30’ సినిమాలో స్టూడెంట్‌గా తెరంగేట్రం చేసిన ఈ భామ.. టాలీవుడ్‌లో ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్యామ్ సింగ్‌రాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో నటించింది. అయితే కోలీవుడ్‌లోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన మాటలతో అవకాశాలు దక్కించుకునే పనిలో బిజీ అయినట్లు సమాచారం. ఇటీవల ఓ కోలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కృతి.. టంగ్ స్లిపై ఓ బూతు మాట మాట్లాడింది. దీంతో కోలీవుడ్ ప్రజలు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆ మాట కావాలని అనలేదంట. పొరపాటున బయటకి వచ్చిందని కృతి చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -