Kushakal Villagers: వీధి కుక్కలకు రూ.5 కోట్లా ఆస్తి.. ఎవరు ఇచ్చారంటే?

Kushakal Villagers: సాధారణంగా మనం బయటికి వెళ్లినప్పుడు లేదంటే మనం ఉన్న ఏరియాలలో వీధి కుక్కలు చాలా ఉంటాయి. పాపం ఈ వీధి కుక్కలు సరిగా తిండి లేక తిండి బాధలతో అల్లాడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ వీధి కుక్కలు మాత్రం ఇప్పుడు ఆకలి కోసం అలమటించవు. అలాగే ఎక్కడ చెత్తలో కూడా ఆహారం కోసం వెతకవు. ఒక ఊళ్లో ఉన్న కుటుంబాలన్నీ రోజుకు ఒక కుటుంబం చొప్పున ఆహారం తీసుకుని వచ్చే మూడు పూటలా ఇక్కడ ఉన్న వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారట. ఆ ఊరు ఎక్కడ ఉంది? వారు అలా ఎందుకు చేస్తున్నారు అన్న వివరాలు లోకి వెళితే..

గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా పాలన్‌పుర్‌ తాలూకా కుశాకల్‌ గ్రామ ప్రజలు వీధికుక్కల కోసం ఏకంగా 20 బీఘాల భూమి కేటాయించారు. నవాబుల ఏలు బడిలో వ్యవసాయం కోసం గ్రామస్థులకు ఇచ్చిన ఆ భూమిని కాలక్రమేణా వీధి కుక్కలకు కేటాయించారు. అయితే అక్కడ దాదాపు ఎకరంలో మూడవ వంతైన ఒక్క బీఘా భూమి విలువ అక్కడ సుమారు రూ.25 లక్షలు ఉంటుంది. అంటే మొత్తం భూమి విలువ దాదాపు రూ.5 కోట్లు వరకు ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఉన్న ఆ భూమిని ఆ గ్రామస్థులందరూ కలిసి సాగు చేస్తున్నారు. అంతే కాకుండా ఆ ప్రదేశంలో పండిన పంట మొత్తం కూడా కుక్కల కోసమే కేటాయిస్తారట.

కాగా ఆ గ్రామంలో దాదాపుగా 600 ఇల్లు ఉన్నాయట. ఆ గ్రామంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయం, పశుపోషణ పై ఆదారి పడి జీవిస్తున్నారు. అంతేకాకుండా వారికి వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా శునకాల కోసమే ఖర్చు చేస్తున్నారు. అలాగే ఏడాది పొడవునా వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు. పండుగల సమయంలో శునకాలకూ మిఠాయిలు, ప్రత్యేక వంటకాలు ఉంటాయట. అంతేకాకుండా ప్రతిరోజూ ఆ కుక్కుల దగ్గర వున్న గిన్నెల్లో ఆహారాన్ని పెడుతూ ఉంటారట . అయితే అక్కడి గ్రామవాసులు అది వారికీ కొత్త ఏమి కాదని వారి గ్రామంలో అనాధిగా వస్తున్న ఆచారమని వాళ్ళు తెలిపారు. అయితే ఆ ఆచారం వారి పూర్వీకుల కాలం నుంచి వస్తోందని కుశాకల్‌ గ్రామస్థుడు ప్రకాశ్‌ చౌదరి తెలిపారు. ప్రతిరోజూ కుక్కల కోసం 10 కిలోల పిండితో రొట్టెలు చేసి వాటికి పెడతామని చౌదరి తెలిపారు. అదేవిధంగా వీధి కుక్కలు అంటే తరిమి కొట్టే వారు ఉన్న ఈ దేశంలో ఇలా కుక్కలను తమ ఇంటి సభ్యులుగా చూడటం నిజంగా ఆశ్చర్యం అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -