Kusukunta Prabhakar Reddy: మునుగోడులో టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. భయపెడుతున్న అభ్యర్థిపై వ్యతిరేకత

Kusukunta Prabhakar Reddy:  తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక రంజుగా మారింది. పార్టీలన్నీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం ప్రచారం చేస్తోన్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ప్రచారం నేతల మధ్య మాటల తూటాలతో పాటు బరిలోకి దిగిన అభ్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడటం టెన్షన్ పుట్టిస్తోంది. అయితే టీఆర్ఎస్‌కు ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుున్న నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ కు కీలకంగా మారింది. మునుగోడులో ఓడిపోతే కేసీఆర్ జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి బ్రేక్ పడే అవకావముంది.

తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించుకోలేని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశముంది. అందుకే మునుగోడు ఉపఎన్నికను గెలుచుకోవడం అగ్నిపరీక్షలా మారింది. ఒకవేళ మునుగోడులో టీఆఎస్ గెలిస్తే కేసీఆర్ జాతీయ పార్టీపై మరింత దూకుడు పెంచే అవకాశముంది. మునుగోడులో గెలవడం ద్వారా తెలంగాణలో బలం పుంజుకుంటున్న బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ద్వారా బీజేపీ, కాంగ్రెస్ కు ఒకేసారి చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీని ద్వారా జాతీయ పార్టీని దేశవ్యాప్తంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలోనూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేదని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేయనున్నారు.

అయితే ఇలాంటి తరుణంలో మునుగోడులో టీఆర్ఎస్ కు అభ్యర్ధి టెన్షన్ పట్టుకుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవొద్దంటూ మునుగోడు టీఆర్ఎస్ నేతలదందరూ వ్యతిరేకించినా సీఎం కేసీఆర్ ఆయనకే టికెట్ కేటాయించారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్వయంగా కేసీఆర్ కు నచ్చచెప్పి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇప్పించారు. కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గతంలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూకబ్జాలకు పాల్పడ్డారని, ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీని రెండు వర్గాలుగా చీల్చి సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించారనే విమర్శలు ఉన్నాయి.

దీంతో మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారంలో కొత్త ప్లాన్ ను అమలు చేస్తోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు కాకుండా టీఆర్ఎస్, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్ఎస్ నేతలందరూ అదే చెబుతున్నారు. నియోజకర్గానికి ప్రచారానికి వచ్చి మంత్రి హరీష్ రావు మర్రిగూడ మండలాన్ని అభివృద్ధి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక కేటీఆర్ కూడా గట్టుప్పల్ మండాలన్ని దత్తత తీసుకుంటానంటూ చెప్పకొచ్చారు. అవసరమైతే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే మునుగోడు మొత్తాన్ని దత్తత తీసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. ఇక మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్, కేసీఆర్ ను చూసి ఓటేయాలని చెబుతున్నారు తప్ప. .కూసుుంట్ల పేరును ఎవరూ చెప్పడం లేదు.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును కాకుండా టీఆర్ఎస్ కారు గుర్తును ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ నేతలకు సూచించరాు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అవినీతిపై ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోన్నారు. దీంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. ప్రచార తీరును పూర్తిగా మార్చేసింది.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -