KV Anudeep: ఆ పుస్తకాన్ని చదివాక చెప్పులు వేసుకోవడం మానేసిన అనుదీప్!

KV Anudeep: ‘జాతిరత్నాలు’ ఫేమ్ డైరెక్టర్ కేవీ అనుదీప్ అందరికీ సుపరిచితుడే. క్యాష్ షోలో అనుదీప్ చేసిన అల్లరికి, సిల్లీ కామెడీకి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో యాంకర్ సుమతో అనుదీప్ చేసిన అల్లరి, సైటర్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ షో ద్వారానే అనుదీప్‌కు ‘క్యాష్ అనుదీప్’గా మంచి పేరు వచ్చింది. వాస్తవానికి అనుదీప్‌లో కామెడీ యాంగిల్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కామెడీకి సంబంధించినవే. సినిమాల్లో కామెడీ పండించడమే కాకుండా.. రియల్ లైఫ్‌లోనూ అనుదీప్ నవ్వులు పూయిస్తుంటాడు. ఆయన హాజరయ్యే ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లలో ఎంతో హుషారు ఉంటూ.. తన కామెడీ పంచులతో నవ్విస్తుంటాడు.

 

‘పిట్టగోడ’ సినిమాతో డైరెక్టర్‌గా అనుదీప్ కేరీర్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో అనుదీప్ పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలనుకున్నాడు. ‘జాతిరత్నాలు’ మూవీ స్టోరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దృష్టిలో పడటంతో.. ఆయన నిర్మాణంలో సినిమా విడుదలైంది. హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ ఫరియా, కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. కామెడీ టైమింగ్, సినిమా స్టోరీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టనివ్వకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడంతో అనుదీప్‌కు డైరెక్టర్‌గా మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి ‘ప్రిన్స్’ సినిమా తీశాడు. ఈ సినిమా ఓ మాదిరిగా హిట్ అందుకుంది.

 

ఊహించిన స్థాయిలో సినిమా సక్సెస్ కాకపోయినా.. అనుదీప్ ఏమాత్రం నిరుత్సాహపడలేదు. మీడియా ముందు అదే దూకుడు చూపిస్తుంటాడు. యాంకర్లు వేసే ప్రశ్నలకు వింత వింతగా సమాధానాలు చెప్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా అనుదీప్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అనుదీప్ ఏ కార్యక్రమానికి వెళ్లిన కాళ్లకు చెప్పులు, షూస్ వేసుకోడట. దానికి ఒక పెద్ద కారణమే ఉందని అనుదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. క్లీన్ ఒబెర్ అనే రచయిత రాసిన ‘ఎర్తింగ్’ పుస్తకాన్ని చదివిన తర్వాత తాను చాలా మారిపోయినట్లు అనుదీప్ వెల్లడించాడు. మనిషి జీవితంలో ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ భాగమయ్యాక ప్రకృతి-మనిషికి మధ్య బంధం దూరమవుతుందన్నారు. భూమికి-మనిషికి ఉన్న కనెక్టివిటీ తగ్గిపోతుందని భావించి అప్పటినుంచి అనుదీప్ చెప్పులు వేసుకోవడం మానేసినట్లు చెప్పుకొచ్చాడు. చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అనుదీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -