Labuschagne: మ్యాచ్ మధ్యలో లైటర్ అడిగిన లబుషేన్.. సోషల్ మీడియాలో వైరల్

Labuschagne: ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబుషేన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ (10) అవుటైన తర్వాత మార్నస్‌ లబుషేన్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే అతడి వింత కోరికతో కామెంటేటర్లు, క్రికెట్ అభిమానులు షాక్ తిన్నారు.

అసలు ఏం జరిగిందంటే.. లబుషేన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెల్మెట్‌తో సమస్య ఏర్పడింది. దాంతో హెల్మెట్‌ను పలుసార్లు తీసి మళ్లీ పెట్టుకున్నాడు. చివరకు సిగరెట్‌ లైటర్‌ కావాలని ఆసీస్ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సైగ చేశాడు. అతడు చేసిన సైగతో అందరూ షాక్‌కు గురయ్యారు. లబుషేన్ మ్యాచ్ మధ్యలో సిగరెట్ కాల్చే లైటర్ ఎందుకు అడుగుతున్నాడో డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి కూడా అర్ధం కాలేదు. అయితే హెల్మెట్ రిపేర్ కోసమే అతడు లైటర్ అడిగినట్లు తెలిసింది.

కొంతసేపటికి ఈ విషయాన్ని గ్రహించిన ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్, డ్రెస్సింగ్‌ రూమ్‌ సిబ్బంది లైటర్‌ను తీసుకెళ్లి లబుషేన్‌కు ఇచ్చారు. లైటర్‌తో హెల్మెట్‌ లోపలి భాగంలో కాలుస్తూ లబుషేన్ రిపేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మొత్తానికి లబుషేన్ చేసిన సైగ తొలిరోజు ఆటలో హైలెట్‌గా నిలిచింది.

ముందే ముగిసిన తొలిరోజు ఆట
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మూడో టెస్టులో తొలి రోజు ఆట ముందే ముగిసింది. వర్షం అంతరాయం కలిగించడం, వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను ముందే ముగించాల్సి వచ్చింది. దీంతో తొలిరోజు 47 ఓవర్లు మాత్రమే పడ్డాయి. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఖవాజా (54 నాటౌట్), లబుషేన్ (79) హాఫ్ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు వికెట్లు సాధించాడు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -