Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చింది నేనే!

Lakshmi Parvathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్సెటైల్ నటుడు ఎవరన్నా ఉన్నాడంటే అది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్. డ్యాన్స్, డైలాగులు, నటన, కామెడీ ఇలా అన్ని రకాలుగా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చే ఎన్టీఆర్ కు.. ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ సినిమాలో ‘కొమురం భీముడో’ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

 

 

నందమూరి హీరోనే అయినా ఎంతో కష్టపడే జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలోకి ప్రవేశించాడని చెప్పుకోవాలి. నందమూరి నట వారసత్వాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్న యంగ్ జనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడని చెప్పుకోవాలి. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి దివంగత నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన తల్లి గురించి ఆమె వ్యాఖ్యానించారు.

 

తనకు బాలయ్య కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవని సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి వివరించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తల్లి, జూనియర్ ఎన్టీఆర్ ను అప్పట్లో పిలిపించినట్లు ఆమె తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిని ఇంటికి పిలిపించి పట్టుచీర పెట్టినట్లు, జూనియర్ ఎన్టీఆర్ కు డ్రెస్ తెప్పించి ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

 

 

అప్పట్లో అందరితో తనకు మంచి సంబంధాలు ఉండేవని వివరించిన లక్ష్మీపార్వతి.. చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తమ వద్దకు వచ్చి ఆడుకునే వాడని చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ అని, తనకు, ఎన్టీఆర్ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రేమ అని ఆమె పేర్కొంది. ఇప్పుడు లక్ష్మీపార్వతి చేసిన ఈ కామెంట్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -