LastRites: కన్నీరు పెట్టించే ఘటన.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు?

LastRites: చాలామంది చనిపోయినప్పుడు తండ్రి తలకొరివిని కొడుకు పెట్టాలి అని అంటూ ఉంటారు. సందర్భాను సారం కూడా కొడుకులే తండ్రులకు తలకొరివిని పెట్టాలి అని అంటూ ఉంటారు. అయితే కొడుకు లేనప్పుడు కొన్ని కొన్ని సార్లు కూతురే తల్లి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఎంతోమంది తల్లిదండ్రులకు కూతురే దహన సంస్కారాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక కూతురు తండ్రి అంతక్రియలను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

ఈ కన్నీళ్లు తెప్పించే హృదయ విధారక ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామానికి చెందిన శంకుల బాల సుబ్రహ్మణ్యం రెడ్డి 46 ఏళ్ల వ్యక్తి చిన్నపాటి కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తు ఉండేవాడు. ఆయనకు భార్య శారద, కుమార్తెలు తేజ, లిఖిత లు ఉన్నారు. కుమార్తెల ఉన్నత చదువుల కోసమని కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నాడు. అక్కడే ఓ సంస్థలో సబ్ కాంట్రాక్టర్ గా బాల సుబ్రహ్మణ్యం పని చేసేవారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నాగాలాండ్ లో ఒక పని కుదిరింది. అందుకోసం దాదాపుగా రూ.12 కోట్ల రూపాయలు అప్పు చేసి మరీ అప్పు చేసి ఆ పనులను పూర్తి చేశాడు.

 

అయితే ఈ పనికి సంబంధించి బిల్లులు రావాల్సి ఉన్నాయి. సదరు సంస్థ రూ.4.03 కోట్లను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆయన సంస్థను చాలా సార్లు కోరాడు వేడుకున్నాడు. కాని సుబ్రహ్మణ్యం రెడ్డికి డబ్బులు ఇవ్వకుండా వాళ్లు అతన్ని వారి ఆఫీసులో చుట్టూ తిప్పించుకున్నారు. ఇటీవల సెప్టెంబర్ లో నాగాలాండ్ నుంచి హైదరాబాద్ కు రాగా ఇంటి వద్ద ఆయనకు అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో తిరిగి నాగాలాండ్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 8న ఆయన ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడని హైదరాబాద్ పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు.

 

తనను మోసం చేసిన సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి రాసిన సూసైడ్ లేఖ అక్కడ లభించింది. నాగాలాండ్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తండ్రి మరణవార్తలో కుమార్తెలు తల్లడిల్లిపోయారు. సుబ్రహ్మణ్యం రెడ్డి మృతితో అతని కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. తాజాగా బంధువుల సహాయంతో మృతుడి కుమార్తెలు తండ్రికి అంత్యక్రియలను నిర్వహించారు. ఇద్దరు కూతుళ్లు కొడుకులుగా మారి తండ్రికి తలకొరివి పెట్టారు. ఈ హృదయ విషాదకర దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. మనసును బాధ పెట్టించే ఆ ఘటన చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -