AP Assembly Elections: ఏపీ ఎన్నికల్లో ఒకటి మాత్రం తక్కువైందా.. ఇప్పటివరకు ఆ పరిస్థితి మాత్రం లేదుగా!

AP Assembly Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా సంచలనంగా ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఎన్నికల హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వా నేనా అంటూ పెద్ద ఎత్తున పోటీకి పడుతూ మరి ఎన్నికలలో అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు అయితే రాష్ట్ర విడిపోయిన తర్వాత 2014 19వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల తరహాలో ఈసారి ఎన్నికలు జరగడం లేదని తెలుస్తోంది.

పార్టీ అధినేతలకు తప్పదు కనుక వాళ్ళు బయటకు వచ్చే ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు ఇక అభ్యర్థులు సైతం వారి నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ వారి వెంట నడిచే కార్యకర్తలే ముందుకు రావడంలేదని తెలుస్తోంది రాజకీయాలు అంటే అట్టుడికి పోతూ ఉంటాయి అలాంటిది ఏపీలో మాత్రం రాజకీయ ప్రచార కార్యక్రమాలు చాలా చెప్పగా కొనసాగుతున్నాయి.

ఈసారి రాజకీయ ప్రచార కార్యక్రమాలకు కార్యకర్తల ముందుకు రాలేదు అంటే బహుశా ఎన్నికలపై ఎవరికి ఆసక్తి లేదేమో అని సందేహాలు వస్తున్నాయి అంతేకాకుండా ఎవరు గెలిస్తే తమకు ప్రయోజనం ఏంటి అన్న ధోరణిలో కూడా రాష్ట్ర ప్రజలు ఉన్నారేమోనని సందేహాలు వస్తున్నాయి. ఇక్కడ తరచూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య పోటీ ఉండడంతో కూడా బహుశా ప్రజలు ఆసక్తి చూపించలేదేమో అని తెలుస్తుంది.

మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే సరిగ్గా 35 రోజులు ఎన్నికలకు సమయం ఉంది అన్నప్పటికీ ఇంకా ప్రచార కార్యక్రమాలు మాత్రం పుంజుకోలేదు. బహుశా నామినేషన్స్ వేసిన తర్వాత అయినా అభ్యర్థుల తమ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తారా లేకపోతే ఇలా చప్పగానే ఎన్నికలను ముగించేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అభ్యర్థులు కూడా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ఎప్పుడు ఎవరిని ఎటు మారుస్తారో తెలియని అయోమయంలో ఉన్న నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా ఆసక్తి కనపరచడం లేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -