Lavanya Tripathi – Varun Tej: వరుణ్ తేజ్ తో ప్రేమనా.. రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi – Varun Tej: లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా లావణ్య త్రిపాటికి తెలుగులో బారిగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..

సినీ ఇండస్ట్రీకి మొదట్లో వచ్చినప్పుడు ఇంతగా చూసేవారు. అప్పుడు నాకు ఏదోలా అనిపించేది. అలా కెరీర్ మొదట్లోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. ఆ తర్వాత అదే జీవితమని తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. అయితే మొదట్లో నా విజయాలను సెలబ్రేట్ చేసుకునే దాన్ని కాదు కానీ ఆ తర్వాత తప్పని తెలుసుకొని సక్సెస్ ను ఇతరులతో పంచుకొని వేడుక చేసుకోవడం మొదలుపెట్టాను అది రెట్టింపు అవుతుందని అప్పుడు అర్థమయింది అని తెలిపింది లావణ్య త్రిపాఠి.

నాకు ఇండస్ట్రీలో నాకు నిహారిక, రీతూ వర్మ, సందీప్‌ కిషన్‌, శిరీష్‌ ఇలా చాలామందే ఫ్రెండ్స్‌ ఉన్నాను. ఇందులో చాలామంది నాతో పాటు కలిసి నటించినవాళ్లే. కానీ నాకు క్లబ్బులకు, పబ్బులకు వెళ్లడం ఇష్టం ఉండదు అని తెలిపింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుణ్ తేజ్ తన విషయంలో వస్తున్న వార్తలపై స్పందించిన లావణ్య..అతడితో కలిసి రెండు సినిమాల్లో నటించాను..ఆమాత్రం దానికే లింకు పెట్టేస్తున్నారు. అసలీ పుకారు వినడానికి కూడా అదోలా ఉంది. ఒకసారైతే నేను సహజీవనం చేస్తున్నానని రాసేశారు. అది చూసి నేను షాక్ అయ్యాను తెలిపింది లావణ్య. నేను ఇంకా సింగిల్ గానే చెప్పుకొచ్చింది లావణ్య.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -