CM KCR: హైదరాబాద్‌కు చేరుకుంటున్న పలు పార్టీల నేతలు.. పక్కా ప్లానింగ్‌తో అడుగులు.

CM KCR: జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్.. కొత్త పార్టీ ఏర్పాటుపై బుధవారం కీలక ప్రకటన చేయనున్నారు. దసరా రోజుల మధ్యాహ్నం 1.19 పార్టీ ప్రకనటకు ముహుర్తంగా ఖరారు చేశారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు వెనక కేసీఆర్ భారీ కసరత్తే చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. పక్కా ప్లాన్‌తో జాగ్రత్తగా అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా కేసీఆర్ ఇదే పనిపై పూర్తి దృష్టి సారించినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే.. కేసీఆర్ కొత్త పార్టీకి మద్దతు తెలిపేందుకు పలు రాష్ట్రాల నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అయితే వారందరికీ కేసీఆర్ ముందుగానే తన ప్రణాళికలను వివరించి.. మద్దతుగా నిలవాలని కోరినట్టుగా తెలుస్తోంది.

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ గౌడ, మాజీ మంత్రి రేవన్న‌తో పాటు పలువురు జేడీఎస్ నేతలు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ వారికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు స్వాగతం పలికారు. మరోవైపు తమిళనాడులోని వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్‌ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. దళిత ఉద్యమ పార్టీగా వీసీకేకు గుర్తింపు ఉంది. ఆ పార్టీకి ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేల బలం ఉంది.

మరో మూడు పార్టీల నేతలు కూడా రేపు జరగనున్న రేపు తెలంగాణ భవన్‌లో జరగనున్న సమావేశానికి హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అఖిలేష్ యాదవ్ కూడా రావాల్సి ఉందని.. అయితే ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయన రాలేకపోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, కొన్ని చిన్న పార్టీలో కేసీఆర్ ఏరపాటు చేయబోయే కొత్త జాతీయ పార్టీలో విలీనమవుతాయని ఆ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగే సమావేశంలో కొత్త పార్టీ తీర్మానం(పార్టీ పేరు మార్పుకు సంబంధించి) చేసి.. అందుకు ఆమోదం తెలపనున్నారు. ఆ తీర్మానాన్ని గురువారమే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు.

ఈ రకమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న కేసీఆర్ పక్కా ప్లాన్‌తోనే.. కొత్త పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లో ఎంటర్ అవుతున్నట్టు స్పష్టం అవుతుంది. పెద్ద మొత్తం మార్పు తీసుకురాకపోయిన్పటికీ.. కొన్ని రాష్ట్రాల ఆ పార్టీ ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో మేధావులను, రైతు నాయకులను కూడా తన కొత్త పార్టీ తరఫున బరిలో నిలిపే ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. తన కొత్త పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కించుకుంటారనే మాట కూడా వినిపిస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా జాతీయ పార్టీ హోదా పొందాలంటే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది. అయితే పెద్ద కష్టమైన పని కాదని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -