Upasana: లీకైన ఉపాసన స్కాన్ రిపోర్ట్.. డబుల్ ధమాకా అంటూ?

Upasana: మెగా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా లాంటి వార్త. గత పది సంవత్సరాలుగా మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి తను తాతను కాబోతున్నాడని చెప్పినప్పటి నుంచి అందరూ సంతోషిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసి అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వార్తకు సంబంధించి గత కొన్ని రోజులుగా పలు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

 

మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అయితే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు మెగా వారసుడు వస్తున్నాడని తెలియడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకున్నారు. తాజాగా మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఆ వార్త అందరికీ డబుల్ ఆనందాన్ని పంచుతోందని చెప్పాలి.

 

ప్రస్తుతం ఉపాసన ఐదో నెల పూర్తి చేసుకుని ఇటీవలె స్కాన్ తీయించుకుంది. ఆ స్కాన్ రిపోర్టులో ఆమెకు కవల పిల్లలు ఉన్న విషయం తెలిసిందంట. మెగా కాంపౌండ్ నుంచి ఈ మ్యాటర్ లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆ వార్త చక్కర్లు కొడుతోంది. లేటుగా చెప్పిన లేటెస్ట్ గా రామ్ చరణ్, ఉపాసనలు గుడ్ న్యూస్ చెప్పారని అందరూ ఉత్సాహంతో సంబరం చేసుకుంటున్నారు.

 

కంగ్రాట్స్ వదినమ్మ అంటూ మెగా ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. అందులో కూడా ఒక పాప ఒక బాబు పుడితే మెగాస్టార్ కల తీరిపోతుందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై మెగాస్టార్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. ఏదేమైనా తండ్రి, తాతకు మించి మెగా వారసుడు రానున్నాడని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వినేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తామని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -