Dhan Varsha Plan: దీపావళి సందర్భంగా సరికొత్త బీమాను ప్లాన్ చేసిన ఎల్ఐసి.. అదేంటంటే?

మన దేశంలోని ప్రజలు చాలామంది ఎల్ఐసి లో ఏదో ఒక భీమా తీసుకొని ఉంటారు ఎందుకంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఉండడం కోసం. ఇది అంతో ఇంతో ఆర్థికంగా వారికి మేలు చేస్తుంది.జీవిత బీమాలో అగ్రసంస్థగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను తీసుకొస్తూ ఉంటుంది.

ప్రజల దగ్గరకు ఇది వెళ్లేందుకు సరి కొత్త ప్లాన్ ను లాంచ్ చేసింది. ధన్ వర్ష పేరుతో ప్రజలకు బాగా ఉపయోగపడే ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇది క్లోజ్-ఎండెడ్ పథకం. ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్.నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. ఇది పాలసీదారులకు రక్షణను, పొదుపును రెండింటిని కలిగి ఉన్న ఒక మంచి ప్లాన్.

ఎవరైనా పాలసీదారుడు,పాలసీదారి ధన్ వర్ష పథకం తీసుకున్నాక పాలసీ టర్మ్‌లో ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆయన లేదా ఆమె కుటుంబానికి నగదు సహాయం అందించనున్నట్టు ఎల్ఐసీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.ఈ పాలసీని తీసుకున్న తర్వాత యాక్సిడెంట్‌లో పాలసీదారుడు మరణిస్తే లంప్‌సమ్‌లో డబ్బులను చెల్లించే అవకాశం ఉంది.

ఒకవేళ ఆ ప్రమాదం వల్ల శాశ్వతంగా అంగవైకల్యం పొందితే, యాక్సిడెంట్ ప్రయోజనాల కింద అందించే మొత్తాన్ని పదేళ్ల పాటు నెలవారీ వాయిదాల్లో చెల్లిస్తుందని ఎల్ఐసి వెబ్సైట్లో రాసి ఉంది.ఎల్ఐసీ వెబ్‌సైట్‌లోని పొందుపరిచిన వివరాల ప్రకారం ఎల్ఐసీ ప్లాన్ నాన్ మెడికల్, మెడికల్ రెండు విధాలుగా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ప్లాన్‌ను ఏజెంట్ ద్వారా లేదా ఇతర ఇంటర్‌మీడియేటర్స్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఎల్ఐసీ ధన్ వర్ష పాలసీ టర్మ్ పదేళ్లు, 15 ఏళ్లుగా ఉంది. పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ టర్మ్ తర్వాత కూడా జీవించి ఉంటే,వారికి ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు గ్యారెంటీడ్ అడిషన్స్, ప్రతి ఏడాది చివరిలో కలుస్తూ ఉంటాయి.

పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. కనీసం రూ.1,25,000కి పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఒకేసారి డబ్బులు కట్టాల్సి ఉంది. పదేళ్ల పాలసీకి అయితే ఆప్షన్ 1 కింద 70 శాతం, ఆప్షన్ 2 కింద 60 శాతం లోన్ తీసుకునే వీలు కల్పించింది. అలాగే 15 ఏళ్ల పాలసీకి అయితే ఆప్షన్ 1 కింద 60 శాతం, ఆప్షన్ 2 కింద 50 శాతం వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Bonda Uma: రాయిదాడి జగన్నాటకమేనా.. బోండా ఉమను ఇరికించే విధంగా కుట్ర జరుగుతోందా?

Bonda Uma: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల రాయి దాడి ఘటన పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు కారణమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -