Liger Movie: లైగర్ ఎఫెక్ట్.. జనగణమన సినిమా ఆగిపోయినట్టేనా?

Liger Movie: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం లైగర్. ఈసినిమాకు హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన నటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా నేడు పాన్ ఇండియా లెవెల్లో భార్య అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ విడుదల కానున్న ఈ సినిమాపై అంతకుమించి అన్న విధంగా అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

అయితే తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన లభిస్తోంది. కానీ కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమా యావరేజ్ గా ఉంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాపై పాజిటివ్ గా కంటే నెగటివ్ ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ రాబోతున్న మరొక సినిమా జనగణమన సినిమా పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పూరి జగన్నాథ్ కెరిర్ లో లైగర్ సినిమాతో వీకేస్ట్ డైరెక్షన్ చేయడంతో ప్రస్తుతం ఆయన తదుపరి సినిమాపై చర్చలు మొదలయ్యాయి.

కొడుకు ఆకాష్ పూరి నటించిన మెహబూబా, రొమాంటిక్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి చేతులు కాల్చుకున్న పూరీ జగన్నాథ్ కు సినిమాతో మరొక దెబ్బ ఎదురైనట్లు అయింది. దీంతో విజయ్ దేవరకొండ హీరోగా పూరి ప్రొడ్యూస్ చేస్తున్న జనగణమన సినిమా పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఈ జనగణమన కథకు మొదట మహేష్ బాబు ఒప్పుకొని ఆ తర్వాత రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -