Liger Movie Review: లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేది: ఆగస్ట్‌ 05,2022
నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, తదితరులు
నిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
నిర్మాత: పూరి జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఎడిటర్‌: జునైద్ సిద్దిఖీ

Liger Movie Review and Rating

పూరి జగన్నాథ్ ఎప్పుడో అవుట్ డేటెడ్ డైరెక్టర్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ ఎలాగోలా హిట్ అయింది. దాంతో నిర్మాతగానూ నిలదొక్కుకున్నాడు పూరి. ఇక ఇప్పుడు విజయ్‌ని లైగర్ అంటూ ప్రేక్షకుల ముందుకు నిలబెట్టేశాడు. ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 25) విడుదలైంది. ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

కథ: ఓ తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో లైగర్‌ను పట్టాలెక్కించాడు. ఇందులో తన స్టైల్ మార్క్ చూపించేందుకు హీరోకు సపరేట్ యాటిట్యూడ్, బిహేవియర్‌ను పెట్టాడు. కరీంనగర్‌లోని చిన్న ఊరి నుంచి బయల్దేరిన తల్లీ కొడుకులు ముంబైకి వచ్చి ఏం చేశారు.. తన కొడుకుని చాంపియన్ చేయాలని చూసిన తల్లి కల ఎలా నెరవేరింది.. ప్రపంచ చాంపియన్ మైక్ టైసన్‌తో ఉన్న లింక్ ఏంటి? ఈ కథలో అనన్య పాండే ట్రాక్ ఉద్దేశ్యం ఏంటి? అన్నదే లైగర్ కథ.

నటీనటుల పనితీరు: విజయ్ దేవరకొండ తన పాత్రకు న్యాయం చేశాడు. అసలే యాంగ్రీమెన్‌గా అద్భుతంగా నటించేస్తాడు. ఈ చిత్రంలో మరింత కొత్తగా నటించేశాడు. నత్తి ఉన్నట్టుగా భలే మ్యానేజ్ చేశాడు. ఇక అనన్య అందాలు తెలుగు వారికి కొత్తే. అందంగా కనిపించడమే కాదు.. పూరి హీరోయిన్లకు ఉండే పొగరుని చూపించేసింది. రమ్యకృష్ణ నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించేశారు.

విశ్లేషణ:
పూరి జగన్నాథ్ సినిమాలు ఏమంత కొత్తగా ఉండవు. కొత్త నేపథ్యం గానీ, కొత్త కథనం గానీ ఉండవు. అన్నీ ఒకే మూస ధోరణిలోకి వచ్చేశాయి. అప్పుడెప్పుడో కొత్తగా ట్రై చేశాడు. బద్రి, ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి వంటి చిత్రాల టైంలో ఉన్న పూరి వేరు.. పోకిరి తరువాత వచ్చిన పూరి వేరు.

గ్యాంగ్‌స్టర్లు, మాఫియాలు అంటూ ఒకే ధోరణిలో సినిమాలు తీస్తూ తీస్తూ మనల్ని బోర్ కొట్టించేశాడు. ఇక పూరి స్టఫ్ అయిపోయిందనుకున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ తీసి హిట్ కొట్టి మాస్ పల్స్, మాస్ స్టామినాను మరోసారి చూపించాడు. అందుకే ఈ లైగర్‌ను కూడా అదే మీటర్‌లో తెరకెక్కించాడు. ఈ సారి అంతకు మించి ప్రమోషన్స్ చేసి.. పాన్ ఇండియా అని ఊదరగొట్టేశారు.

కానీ ఇందులో అంత సరుకులేదనిపిస్తోంది. ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా కనిపించలేదు. ఎక్కడా కూడా కథ, కథనాలు ఆసక్తికరంగా సాగలేదు. వెరసి సినిమా బెడిసి కొట్టే పరిస్థితికి వచ్చింది. లైగర్ సినిమా ఇప్పుడు ఏ రకంగానూ జనాలు ఆకట్టుకునే ఆస్కారం లేకుండా పోయింది. కనీసం పాటలు విని హాయిగా ఉందామంటే అవేంటో కూడా అర్థం కావడం లేదు. పోనీ మునుపటిలా పూరి డైలాగ్స్ విందామంటే అవి కూడా కనిపించవు. కెమెరామెన్, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ ఓకే అనిపిస్తాయి. నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారనిపిస్తోంది.

ప్లస్ పాయింట్స్
విజయ్ దేవరకొండ

మైనస్ పాయింట్స్
కథ, కథనం
సంగీతం, నేపథ్యం సంగీతం
ఎక్కడా కొత్తదనం లేకపోవడం

రేటింగ్: 1.5/5

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -
విడుదల తేది: ఆగస్ట్‌ 05,2022 నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, తదితరులు నిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాత: పూరి జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ దర్శకత్వం: పూరి జగన్నాథ్ సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ ఎడిటర్‌: జునైద్ సిద్దిఖీ Liger Movie Review and Rating పూరి జగన్నాథ్ ఎప్పుడో అవుట్ డేటెడ్ డైరెక్టర్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ ఎలాగోలా హిట్ అయింది. దాంతో నిర్మాతగానూ నిలదొక్కుకున్నాడు...Liger Movie Review: లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్