Liger: ఈడీ ఆఫీస్ లో పూరీ జగన్నాథ్ ఛార్మి.. చేసిన తప్పు ఇదే!

Liger: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైలాగులతో సినిమా మీద అంచనాలను పెంచగల స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన సినిమాలోని డైలాగులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎలాంటి హీరోని అయినా కొత్తగా, మాస్ జనాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో పూరి జగన్నాథ్ కు తనదైన మార్క్ ఉంది.

 

ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో, ఛార్మి నిర్మాతగా, విజయ దేవరకొండ హీరోగా చేసిన సినిమా ‘లైగర్’. ప్యాన్ ఇండియా సినిమా అంటూ హల్ చల్ చేసిన లైగర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం తుస్సుమంచి. పూరి మార్క్ సినిమా అనేలా ఈ సినిమా లేకపోగా.. ఈ సినిమా భారీగా నష్టాలను చవిచూసింది. కాగా తాజాగా పూరి, ఛార్మిలను ఈడీ అధికారులు విచారించడం చర్చనీయాంశం అయింది.

 

లైగర్ సినిమాకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండకు ఇంకా పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. సినిమాను మార్కెటింగ్ చేయడంలో లైగర్ టీం సక్సెస్ అయింది. అదే సమయంలో నాన్ థియేటర్ హక్కులు కూడా మంచి రేట్లకు అమ్ముడయ్యాయి. ఇక సినిమాకు పెద్దగా ఖర్చు చేసింది కూడా ఏమీలేదు. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. కానీ నిర్మాత ఛార్మి మాత్రం ఎవరికి రూపాయి ఇవ్వలేదు.

 

ఈ సినిమా నిర్మాణం కోసం విదేశాల నుండి డబ్బులు వచ్చినట్లు గుర్తించిన ఈడీ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. సినిమాకు వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? ఏమైపోయాయి? ఎక్కడి నుండి ఎలా వచ్చాయనే అంశాల మీద పూరి జగన్నాథ్ ని మరియు ఛార్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లైగర్ సినిమాకి బినామీ పెట్టుబడులు వచ్చాయని ఈడీ అనుమానిస్తుండగా.. ఆ డబ్బులు ఎవరివి, ఎక్కడివి, ఎక్కడికి వెళ్లాయనే విషయాల మీద ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -