Review: లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రివ్యూ!

Review విడుదల తేదీ : నవంబర్4, 2022

నటీనటులు : సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, తదితరులు

నిర్మాణ సంస్థ : ఆముక్త క్రియేషన్స్

నిర్మాతలు : వెంకట్ బోయినపల్లి

దర్శకత్వం : మేర్లపాక గాంధీ

సంగీతం : ప్రవీణ్ లక్కిరాజు, రామ్ మిరియాల

ఎడిటర్ : రామ్ తుము

సినిమాటోగ్రాఫర్ : ఎ.వసంత్

 

నవంబర్ మొదటి వారంలో ఏకంగా పది సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండగా ఈ పది సినిమాలలో అంతోఇంతో అంచనాలు ఏర్పడిన సినిమాలలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ కూడా ఒకటి. కెరీర్ తొలినాళ్లలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ :

సంతోష్ శోభన్ కు యూట్యూబ్ ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని కోరిక కాగా అందుకోసం ట్రావెల్ బ్లాగర్ గా మారాలని అనుకుంటాడు. ఆ ప్రయాణంలోనే ఫరియా అబ్దుల్లాతో పరిచయం ఏర్పడుతుంది. సంతోష్ శోభన్ స్నేహితుడు నెల్లూరు సుదర్శన్ కూడా అతనికి తన వంతు సహాయసహకారాలను అందిస్తుంటాడు. అయితే సంతోష్ శోభన్ కు ఈ ప్రయాణంలో అనుకోని సంఘటనలు ఎదురై ఒక్కసారిగా పరిస్థితులు తలక్రిందులవుతాయి.

 

సంతోష్ శోభన్ ట్రావెల్ బ్లాగర్ గా సక్సెస్ సాధిస్తారా? ఫరియా అబ్దుల్లాతో తన ప్రేమను గెలిపించుకుంటారా? తనకు ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏం చేశారనేదే మిగతా కథ.

విశ్లేషణ

దర్శకుడు మేర్లపాక గాంధీ సింపుల్ కథనే ఎంచుకుని ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఆ కథను తెరకెక్కించడం గమనార్హం. అయితే షార్ట్ ఫిల్మ్ కు సరిపడా కథను మేర్లపాక గాంధీ సినిమాగా తెరకెక్కించారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ ఆకట్టుకునేలా ఉంది. కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నా మరికొన్ని కామెడీ సీన్స్ మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోవడం గమనార్హం.

సాంకేతిక నిపుణుల పనితీరు :

సినిమా నిడివి తక్కువే అయినా ఎడిటర్ ఈ సినిమాను రెండు గంటలకు కుదించి ఉంటే సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది. రామ్ మిరియాల సాంగ్స్ లో “లచ్చుమమ్మ” సాంగ్ మాత్రమే బాగుంది. దర్శకుడు మేర్లపాక గాంధీకి ఈ సినిమాతో మరో ఫ్లాప్ ఖాతాలో చేరినట్టే అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

ప్లస్ పాయింట్లు :

సంతోష్, ఫరియా అబ్దుల్లా నటన

కొన్ని కామెడీ సన్నివేశాలు

లచ్చుమమ్మ సాంగ్

మైనస్ పాయింట్లు :

కథ, కథనం

డైరెక్షన్

ఫస్టాఫ్

కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే

రేటింగ్ : 2.5/5.0

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -