AP Govt: ఏపీ ప్రభుత్వానికి లోక్ సభ కార్యాలయం నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కలకలం

AP Govt: ఏపీ ప్రభుత్వానికి లోక్ సభ కార్యాలయం షాక్ ఇచ్చింది. లోక్ సభ కార్యాలయం జగన్ సర్కార్ కు నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితోనే నోటీసులు పంపిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి లోక్ సభ కార్యాలయం తెలపింది.

 

ఏపీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందంటూ ఇటీవల నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభ కార్యాయలంలో ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత గోప్యత హక్కును ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందని రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుపై లోక్ సభ కార్యాలయం స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీకి లోక్ సభ కార్యాలయం నోటీసులుు జారీ చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

తన రెండు ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఎంపీగా ఉన్న తమ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని సూచించింది. దీంతో రఘురామకృష్ణంరాజుకు వివరాలను ఏపీ ప్రభుత్వం ఇస్తుందా.. లేదా అనేది చర్చనీయాంశంా మారింది. కాగా రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపై దూకుడు మీద ఉన్నారు. జగన్ సర్కార్ పై విరుచుకుపడుతూనే ఉంటూ విమర్శలు చేస్తోన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీంతో రఘురామకృష్ణంరాజుపై ఏపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. సీఐడీ పోలీసులు ఒకసారి ఇప్పటికే రఘురామకృష్ణంరాజును గతంలో అరెస్ట్ చేశారు. కానీ బెయిల్ పై ఆయన బయటకొచ్చారు. సీఐడీ పోలీసులు రఘురామకృష్ణంరాజు కొట్టారని, ఆయనపై తీవ్ర గాయాలైనట్లు అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -