Flipkart Sale: మొబైల్ కొనుగోలు దారులకు శుభవార్త.. ఈ ఫోన్ అతి తక్కువ ధరకే!

Flipkart Sale:  మొబైల్ కొనుగోలు చేసే వారికి ఇది ఫ్రెష్ కేకులాంటి వార్తే అని చెప్పొచ్చు. మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కచ్చితంగా ఈ వార్త మీ కోసమే. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం దసరా సేల్ నిర్వహిస్తోంది. అదిరిపోయే ఆఫర్లతో కష్టమర్లను ఆకట్టుకుంటోంది. భారీ డిస్కౌంట్లు అందిస్తూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో మొబైల్ తీసుకొనే వారు ఈ ఆఫర్ తప్పక తెలుసుకోవాల్సిందే. అది ఎలాగో ఓ లుక్కేయండి..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ నేటి నుంచి ప్రారంభించింది. ఈనెల 8వ తేదీ వరకు సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా రెడ్ మి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఇస్తోంది. రెడ్ మి 10 మోడల్ స్మార్ట్ ఫోన్ పై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర మామూలుగా అయితే రూ.14,999. దీన్ని ఆఫర్ లో రూ.8,999కే కొనేయొచ్చు. దాదాపు 40 శాతం తగ్గింపుతో వినియోగదారులు సొంతం చేసుకోవచ్చన్నమాట.

దీనికి ఇంకా ఆఫర్లు ఉన్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.500 తగ్గింపు ఉంది. రూ.5 వేలకుపైగా ట్రాన్జాక్షన్ చేస్తే తక్షణ డిస్కౌంట్ ఉంటుంది. దీంతో రెడ్ మి ఫోన్ రూ.8,499కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఎలాగూ ఉంటుంది. పాత ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ కొనేటప్పుడు ఎక్స్ఛేంజ్ ఆప్షన్ పెట్టుకుంటే ఇంకా చాలా తక్కువకే ఫోన్ దక్కుతుంది.

ఫోన్ ఫీచర్స్ లో బోలెడు విశేషాలున్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ క్యామ్. 6.7 ఇంచుల హెడ్ డీ డిస్ ప్లే ఉంటాయి. బ్యాటరీ కూడా 6000 ఎంఏహెచ్ తో పటిష్టంగా ఉంది. 18 వాట్ చార్జింగ్ స్పీడ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

దీనికి ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది. తక్కువ ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.808 చెల్లించి ఫోన్ కొనొచ్చు. ఏడాది ఈఎంఐలకు ఇది అప్లికబుల్. 6 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.1,562 చెల్లించాలి. అదే తొమ్మిది నెలలైతే రూ.1,060 పడుతుంది. క్రెడిట్ కార్డు సౌకర్యం లేనివారికి ఫ్లిప్ కార్ట్ పేలేటర్ ఆప్షన్ ఉంది. దీంతో నెలకు రూ.851 కట్టాలి. ఏడాదికి ఇది వర్తిస్తుంది. 9 నెలలకైతే రూ.1,103, ఆర్నెల్లకయితే 1,607 చెల్లించాలి. ఇంకా తక్కువ అంటే మూడునెలల ఆప్షన్ ఉంది. ఇందులో నెలకు రూ.3,121 చెల్లించాలి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -