Mahesh Babu:మహేష్ విషయంలో కృష్ణ చెప్పిన మాటలు నిజమయ్యాయా?

Mahesh Babu: సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ కృష్ణ మహానుభావులు. వారు ఎంత అనుభవజ్ఞులు అంటే.. ఒక సినిమా చుసిన వెంటనే ఆ సినిమా హిట్ అవుతుందా/ ఫ్లాప్ అవుతుందా? లేదా సినిమాలో ఉన్న మైనస్ అంశాలు ఏంటి? పాజిటివ్ అంశాలు ఏంటి? అనే విషయాలను ఇట్టే చెప్పేయగలరు. ఇక వారి దార్శనికతతోనే ప్రిన్స్ మహేష్ బాబుకు నటనపై ఆసక్తి కలిగించడానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసారు. ఆ తర్వాత కొన్ని సినిమాల తర్వాత కొంచెం గ్యాప్ ఇప్పించి.. చదువులు పూర్తి చేయించారు.

ఇక మహేష్ బాబు చేసే ప్రతి సినిమా విషయంలో కృష్ణ గారి చొరవ ఉండేది. కథ, కథనం, మహేష్ నటన విషయాల్లో కృష్ణ గారు స్పెషల్ కేర్ తీసుకునే వారని తెలుస్తోంది. మహేష్ తీసే ప్రతి సినిమా కథలో ఇన్వాల్వ్ అయ్యే కృష్ణ గారు.. మహేష్ కి స్టార్ ఇమేజ్ వచ్చిన తరవాత ఆ బాధ్యతను మహేష్ బాబుపైనే వదిలేసారట. అయితే ఇప్పటికీ మహేష్ సినిమా ఏదైనా విడుదలకు ముందే.. కృష్ణ రివ్యూ తీసుకుంటారు.

మహేష్ బాబు సినిమా రిలీజ్ కు ముందే స్పెషల్ ప్రీమియర్ షో వేసి కృష్ణ గారి అభిప్రాయాలూ, రివ్యూ తీసుకునేవారని టాక్. ఇక కృష్ణ గారు చెప్పినట్టుగా ఆ సినిమా ఫలితం ఉండేదట. అలా కృష్ణ గారు మహేష్ బాబు కెరీర్ లో ఎంతో గొప్ప మార్గదర్శకునిగా ఉండేవారు. అలాగే మహేష్ సినీ కెరీర్ పైన కృష్ణ గారి ప్రభావం ఎంతగానో ఉంది. రమేష్ బాబు కూడా సినీ హీరోగా నిలదొక్కుకుంటారని కృష్ణ గారు భావించగా వారు రాణించలేకపోయారు.

మహేష్ బాబుకు సినిమాల విషయంలో కృష్ణ గారు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చేవారు. కమర్షియల్ సినిమాలతో పాటు.. కంటెంట్ ఉండే సినిమాలు కూడా చేయాలనీ, ఆ సినిమాలు భారీ హిట్స్ అందిస్తాయని సూచించేవారట. ఇక కథల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపేవారు. అలా కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కథ, నటన ఉండాలని తెలిపేవారు. ఈ సూచనలే మహేష్ ని స్టార్ గా నిలబెట్టాయని అంటుంటారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -