
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు గుణ శేఖర్ కూతురి పెళ్లికి హాజరయ్యారు. ఇటీవలె గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ, వ్యాపారవేత్త అయిన రవిల పెళ్లి రిసెప్షన్ వైభవంగా జరిగింది. ఆ వేడుకకు మహేష్ బాబు హాజరయ్యారు. ఆయనే కాదు అల్లు అర్జున్ కూడా ఆ వేడుకకు విచ్చేశారు. రిసెప్షన్ వేదికగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.
రిసెప్షన్ కు అల్లు అర్జున్ తన కూతురు అల్లు అర్హను కూడా తీసుకెళ్లారు. వేదికపై అటు అల్లు అర్జున్, ఇటు మహేష్ బాబులు ఉండటం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ వేడుకలో మహేష్ బాబు బన్నీ కూతురు అల్లు అర్హతో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబు అల్లు అర్హతో మాట్లాడి తన గురించి అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్హతో మహేష్ బాబు ఆప్యాయంగా మాట్లాడ్డం చూసి అందరూ ఆనందపడ్డారు. తను తీసిన శాకుంతలం సినిమాలో అర్హ నటించిందని గుణశేఖర్, మహేష్ కు చెప్పుకొచ్చాడు. ఆ టైమ్ లో కూడా బన్నీ అక్కడ నిలబడలేదు. అప్పటికే దూరంగా జరిగిపోయాడు.
మహేష్ బాబు అర్హతో మాట్లాడ్డం నిజంగా గ్రేట్ అంటూ ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. తన విలువైన సమయాన్ని అల్లు అర్హ కోసం కేటాయించి పాపతో ఆప్యాయంగా మాట్లాడినందుకు ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రిష్ణ చనిపోవడంతో ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహేష్ బాబు ఇప్పుడు షూటింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.