Mahesh Babu: సినిమాల కోసం మహేష్ బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారా?

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న కుటుంబా జాబితాలో ఘట్టమనేని కుటుంబం ఒకటి. ఘట్టమనేని వారసుడిగా తన తండ్రి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తెలుగులో టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో మహేష్ బాబు. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకు తానే పోటీగా నిలుస్తున్న ఏకైక సూపర్ స్టార్ మహేష్ బాబు.

 

మహేష్ బాబు తండ్రి కృష్ణ ఈ మధ్యన మరణించడం తెలిసిందే. మహేష్ బాబు తల్లి అంతకు కొద్దిరోజుల క్రితం మరణించింది. అయితే మహేష్ బాబు ఇలా తన తల్లిదండ్రులను కోల్పోయినా కానీ తన వెంట్రుకలను తీయలేదు. సంప్రదాయం ప్రకారం అయితే కుటుంబీకులు ఎవరైనా చనిపోతే తల వెంట్రుకలు తీస్తుంటారు.

 

కానీ మహేష్ బాబు మాత్రం ఎందుకు తల వెంట్రుకలు తీయడం లేదనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. అయితే దీనికి కారణం వేరే ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు గుండు చేయించుకోవాల్సి ఉన్నా చేయించుకోకపోవడానికి అసలు కారణం అదే అనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 

ఈ సినిమా షూటింగ్ లో కొంత భాగం ఇప్పటికే పూర్తి కాగా.. మరి కొద్ది రోజుల్లో మరో షెడ్యూల్ ఉందట. అయితే ఇప్పుడు ఆయన గుండు చేయించుకుంటే తిరిగి పూర్తిస్థాయిలో జుట్టు రావడానికి ఆరు నెలల టైం పడుతుందని, అంత వరకు సినిమాలకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించాడట. అందుకే గుండు చేయించుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -