Mahesh Babu: మహేష్ కే నో చెప్పిన యంగ్ బ్యూటీ

Mahesh Babu: ఈ మధ్య కుర్ర హీరోయిన్స్ కు ఒకటి రెండు హిట్స్ వచ్చాయి అంటే చాలు కోరికలు ఆకాశాన్ని అంటూంతున్నాయి. ఇలాంటి కోవలోకి యంగ్ బ్యూటీ శ్రీ లీల వచ్చి చేరింది. రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీలో మార్మోగుతున్నా పేరు శ్రీ లీల. మాస్ మహారాజ్ నటించిన ధమాకా మూవీ సూపర్ హిట్ టాక్ టూ వంద కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో అమ్మడు లిస్టులో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. మొదటి సినిమా పెళ్లి సందడి సినిమాలో అందాలు ఆరబోసి యువత మనసులు దోచుకుంది.

 

ఇక రెండో మూవీ ధమాకాలో శ్రీ లీల చేసిన మాస్ పెర్ఫార్మెన్స్ జనాలకు విపరీతంగా నచ్చాయి. అంతేకాకుండా రవితేజతో కలిసి అమ్మడు వేసిన డాన్స్ స్టెప్స్ ఫ్యాన్స్ చేత ఈలలు కొటించాయి. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ తన ఖాతాలో వేసుకుంది. ఇంకేముంది తన క్రేజ్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో ముద్దుగుమ్మ ఒక్కసారిగా రెమ్యూనరేషన్ డబల్, ట్రిపుల్ చేసినట్లు తెలుస్తుంది.

 

అయినా కానీ శ్రీ లీలని తమ సినిమాల్లో బుక్ చేస్కోవడాన్కి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు సమాచారం. దీంతో మరింత రెచ్చిపోతుందంటా ఈ హీరోయిన్. తాను అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తే కానీ సినిమాకు సంతకం పెట్టాను అని ముఖం మీదే చెబుతుందని టాక్. ఈ క్రమంలోనే ఓ బడా హీరో సినిమాకు ఏకంగా మూడింతలు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిందట.

 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న కొత్త మూవీలో శ్రీ లీలను హీరోయిన్ గా అడగా అమ్మడు మూడు కోట్లు కావాలని అడిగిందట. కోటి రూపాయిలు తీసుకునే ఈ హీరోయిన్ మూడు రెట్లు ఎక్కువ అడగటంతో మూవీ నుంచి పక్కన పెట్టాడు అని సమాచారం. మహేష్ లాంటి పెద్ద హీరో, త్రివిక్రమ్ లాంటి గొప్ప దర్శకుడు మూవీ నుంచి కూడా తప్పుకుంది అంటే అమ్మడుకి ఎంత తలపొగరు అని గుసగుసలు ఆడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపుల వల్ల సూసైడ్ చేసుకున్న మహిళ.. ఏం జరిగిందంటే?

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది బెదిరింపులు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం లేకుండా బెదిరింపులకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఓ...
- Advertisement -
- Advertisement -