Mahesh Babu: సినిమా విడుదలకు ముందు అమ్మ చేతి కాఫీ తాగుతాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్!

Mahesh Babu: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయంఅక్కర్లేదు. నటనలో తండ్రికి తగ్గ కొడుకు మహేష్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా మహేష్ ఒక రేంజ్ లో వెలుగుతున్నాడు. ఇక మహేష్ బాబు అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా మహేష్ సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇక ఈరోజు అనగా సెప్టెంబర్ 28న మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణంగా చనిపోయారు. ఈ విషయాన్ని సినీ రాజకీయ వర్గాలు ఏమాత్రం జీర్రించుకోలేకపోతున్నారు. కృష్ణగారి మొదటి భార్య ఇందిరా దేవి. ఇక వీరికి మహేష్, మంజుల, రమేష్ బాబులు పుట్టారు. ఇక మహేష్ తల్లి మరణ వార్త విని తన అభిమానులు ఒక రేంజ్ లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తల్లికి సంబంధించిన ఫోటోలు, గతంలో మహేష్ తన తల్లి గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సాధారణంగా మహేష్ బాబుకి తన తల్లి అంటే ఎంతో ఇష్టం. తన తల్లిని దేవతలా భావిస్తానని మహేష్ చాలా ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. ఈ క్రమంలో మహేష్ మహర్షి సినిమా ఆడియో ఫంక్షన్ లో తన తల్లి గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు అమ్మంటే దేవుడితో సమానం, ప్రతిసారి నా సినిమా విడుదలకు ముందు రోజు ఆమె ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆమె చేతితో ఇచ్చిన కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది.

ఆవిడ ఆశీస్సులు నాకు చాలా ఇంపాక్ట్ గా అనిపిస్తాయి అని మహేష్ బాబు మహర్షి సినిమా ఫంక్షన్ లో తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా మహేష్ బాబు తల్లి చనిపోవడంతో మహేష్ బాబు అభిమానులు మరో స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -