Mahesh Babu: మహేష్ పరువు తీసేలా నూకరాజు బిహేవియర్.. అలా చేయడంతో?

Mahesh Babu: టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా హీరో మహేష్‌బాబు కుటుంబంలో వరుసగా పెనువిషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క ఏడాదిలోనే అతడి కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. జనవరిలో అన్న రమేష్‌బాబు, సెప్టెంబరులో తల్లి ఇందిరాదేవి మరణించగా ఇటీవల తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ కూడా తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో అతడి అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. మహేష్‌బాబు తన సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.

 

ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు మహేష్ కెరీర్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కడు సినిమా మహేష్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాతే మహేష్‌బాబు మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. మహేష్ బర్త్ డే సందర్భంగా ఇటీవల ఈ మూవీని రీ రిలీజ్ కూడా చేశారు. అయితే మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది.

 

సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలను బుల్లితెరపై పలు కార్యక్రమాలలో కమెడియన్లు స్పూఫ్ చేయడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు కమెడియన్స్ చేసే స్పూఫ్ నవ్వు తెప్పించడమే కాకుండా మరి కొన్నిసార్లు అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా జాతి రత్నాలు కార్యక్రమంలో భాగంగా ఒక్కడు సినిమాకు సంబంధించి మహేష్‌బాబును కమెడియన్ నూకరాజు ఇమిటేట్ చేశాడు. అయితే అది అపహాస్యం కావడంతో సూపర్‌స్టార్ అభిమానులు మండిపడుతున్నారు.

ఓవరాక్టింగ్ చేసిన నూకరాజు

స్పూఫ్ అంటే సాధారణంగా ఉండాలి. కానీ నూకరాజు ఓవరాక్టింగ్ చేశాడు. చేతివేలితో ముక్కును తాకుతూ మొన్న క్యాలీఫ్లవర్‌లో సంపూర్ణేష్ బాబు.. నేడు మహేష్ బాబు అనే డైలాగ్ చెప్పాడు. ఎలాగైనా కబడ్డీలో గెలవాలన్నయ్య అనే డైలాగ్‌ను వెటకారంగా చెప్పాడు. ఈ వ్యవహారశైలి మహేష్‌ను అవమానించేలా ఉండటంతో అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే నూకరాజు ఇలా చేశాడంటూ భారీ స్థాయిలో మహేష్ ఫ్యాన్స్ నూకరాజుపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -