Mahesh: ప్రస్తుత కాలంలో మనం ఒక పని చేయలేకపోతే ఆ పనిని పక్క వాళ్ళు చేస్తే చూసి ఆనందించాల్సింది పోయి ఏడవడం మొదలుపెట్టారు ఇలాంటిది ప్రస్తుత సమాజంలో కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు ఈయన ఏషియన్ వారితో కలిసి హైదరాబాద్లో అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా హైదరాబాదులో ఏ ఎం బి మల్టీప్లెక్స్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.
ఇలా హైదరాబాదులో ఈ మల్టీప్లెక్స్ ఎంతో మంచి సక్సెస్ కావడంతో బెంగళూరులో కూడా మహేష్ బాబు ఏషియన్ వారితో కలిసి మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ థియేటర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిని 2024వ సంవత్సరంలో ప్రారంభించాలనే దిశగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఇక బెంగళూరులో ఈ థియేటర్ కెజి రోడ్డులో ఉన్న సుప్రసిద్ధ థియేటర్ కపాలి స్థానంలో ఏడు స్క్రీన్ల సముదాయం తీసుకురాబోతున్నారు. అయితే బెంగళూరులోని కొందరు ఈ థియేటర్ నిర్మాణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొందరు కన్నడిగులు పక్కరాష్ట్రం వాళ్లొచ్చి మన ల్యాండ్ మార్క్స్ ని ఆక్రమించి వ్యాపారం చేయబోతున్నారని, ఇలాంటివి ప్రోత్సహిస్తే మున్ముందు ఇలాంటివి చాలా వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్టులకు మద్దతు తెలుపుగా మరికొందరు విమర్శిస్తున్నారు.
అయితే బెంగళూరులో ఇప్పటికే ఎన్నో మల్టీప్లెక్స్ థియేటర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఢిల్లీ ముంబై కేంద్రంగా పని చేసే కార్పొరేట్ సంస్థలు. ఇప్పుడేదో మహేష్ బాబు ఏషియన్ కలిసి కొత్తగా మొదలుపెట్టిన సంస్కృతి కాదు. అయినా ఏఎంబి మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నటువంటి కపాలి థియేటర్ గత మూడు సంవత్సరాల క్రితమే మూతపడింది దీనిని అమ్మకానికి పెట్టడంతోనే వారు దీనిని మల్టీప్లెక్స్ గా నిర్మించబోతున్నారు. ఇలా మరొక థియేటర్ ప్రాంతానికి వచ్చిందని సంతోషించాల్సింది పోయి ఏఎంబి థియేటర్ పై ఇలాంటి ఏడ్పులు పెట్టడం మంచిది కాదని చెప్పాలి.