Sitara: మురిసిపోయిన మహేష్ గారాలపట్టి.. అలాంటి గిఫ్ట్ ఇవ్వడంతో?

Sitara: బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగానే సంపాదిస్తుంది అలియా భట్. ఈమె గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలె అలియా భట్ ఒక పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇది ఇలా ఉంటే అలియా భట్ గర్భవతిగా ఉన్నప్పుడే ఎడ్-ఎ-మమ్మా అనే స్టార్టప్ కంపెనీని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. 2 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు అవసరమైన దుస్తులను ఈ స్టార్టప్‌ కంపెనీ విక్రయిస్తోంది.

ఈ సంస్థ వెబ్‌సైట్‌లో దాదాపుగా 800లకు పైగా కిడ్‌ వేర్‌ ప్రోడక్ట్స్‌ ఉన్నాయి. కాగా గతంలో జూనియన్‌ ఎన్టీఆర్‌ పిల్లలకు స్టైలిష్‌ డ్రెస్సులు పంపిన అలియా తాజాగా మహేశ్‌ బాబు కూతురు సితారకు కూడా అదిరిపోయే అవుట్‌ ఫిట్‌ పంపించింది. ఇదే విషయాన్ని సితారా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. అలియా పంపిన దుస్తులు ధరించిన మహేశ్‌ కూతురు ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది మీ ఫ్యామిలీలో నన్ను ఒకరిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీ బహుమతులు నాకు ఎంతగానో నచ్చాయి అని క్యాప్షన్‌ ని కూడా జోడించింది. ప్రస్తుతం సితార షేర్ చేసిన ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే సితార విషయానికి వస్తే.. సితారకి ఈ వయసుకే సోషల్ మీడియాలో ఎంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక రకమైన పోస్టులు ఫొటోస్ వీడియోలు పంచుకుంటూనే ఉంటుంది సితార. అంతేకాకుండా సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా మెయింటైన్‌ చేస్తోందీ. పలువురు ప్రముఖులను ఆమె ఇంటర్వ్యూ చేసిన వీడియోలు కూడా అందులో ఉన్నాయి. కాగా మహేశ్‌ నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో సాంగ్‌లో సితార స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. త్వరలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. సితార ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Vanga Geetha: వైసీపీ వంగా గీతకు ప్రజల్లో తిరస్కారం వెనుక అసలు లెక్కలివేనా.. ఏం జరిగిందంటే?

Vanga Geetha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అందరూ చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కాపు...
- Advertisement -
- Advertisement -