Mahesh: తండ్రి ఊరి విషయంలో మహేష్ అలా వ్యవహరిస్తున్నారా?

Mahesh: సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ బాబు కుటుంబం ఈ నెల 27వ తేదీన కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఘట్టమనేని కుటుంబం వెల్లడించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణ పెద్ద కర్మలో మహేష్ బాబుతోపాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, కుటుంబసభ్యులు, సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే కృష్ణ మరణించిన రోజు ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ ఎత్తున ‘పద్మాలయ స్టూడియోస్’కి తరలివచ్చారు. కృష్ణ కడసారి చూపు కోసం గచ్చిబౌలిలో పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరి క్షణంలో ప్లాన్ క్యాన్సిల్ అయింది. దీంతో అభిమానులు కృష్ణను కడసారిగా చూడలేకపోయారు. ఈ క్రమంలో కృష్ణ పెద్ద కర్మ రోజున కృష్ణ అభిమానులను మహేష్ బాబు ప్రత్యేకంగా కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

కాగా, కృష్ణ పెద్ద కర్మను ఆయన స్వస్థలం బుర్రిపాలెంలో కాకుండా.. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షల్‌లో చేయడంపై పలు ఆరోపణలు వస్తున్నారు. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ ఇమిడి రామారావు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మహేష్ బాబు ప్రస్తుతం ఒంటరి వాడయ్యాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఎవరూ లేరు. కృష్ణ పెద్ద కర్మను బుర్రిపాలెంలో చేయడానికి ఎలాంటి అడ్డు లేదు. కానీ సెక్యూరిటీ పర్పస్‌లో మహేష్ బాబుకు ఏమైనా జరుగుతుందేమోనని అందరూ భయపడుతున్నారు. బుర్రిపాలెంలో కృష్ణ గారి దినకర్మ చేయడానికి మహేష్ బాబు ఒప్పుకున్నప్పటికీ.. ఆయన భార్య నమ్రతా ఒప్పుకోరు. కృష్ణ గారి అభిమానులు ఎంతో మంది ఇక్కడే ఉన్నారు. కాబట్టి హైదరాబాద్‌లోనే చేస్తున్నారు. అయితే కృష్ణం రాజును మొగల్తూరులో పెద్ద కర్మ చేశారు. మొగల్తూరులో ప్రభాస్‌లది రాజుల ఫ్యామిలీ. అక్కడ వారిని చూసి భయపడతారు. కానీ బుర్రిపాలెంలో మహేష్ బాబును చూసి భయపడకపోవచ్చు. లేని పోని భయం పెట్టుకుని మహేష్ బాబు భార్య నమ్రతా వద్దనుకున్నారెమో.. వారికి అనుకూలంగా ఎక్కడ ప్రదేశం ఉంటుందో.. అక్కడే పెద్ద కర్మ చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -