Mahesh Babu: ఆ ఒక్క విషయంలో మహేష్ తండ్రి మాట వినలేదా?

Mahesh Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణ. తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కృష్ణకు మహిళా అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. కృష్ణ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన ఇద్దరిని వివాహం చేసుకున్నారు. మొదటగా తన మేనమామ కూతురిని వివాహం చేసుకోగా.. వీరికి ఐదుగురు సంతానం. ఆ తర్వాత ప్రముఖ దర్శకనిర్మాత విజయనిర్మలను వివాహం చేసుకున్నారు.

కృష్ణ మొదటి భార్య పిల్లలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒక్కరిగా రాణిస్తున్నారు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఆ తర్వాత ‘యువరాజు’ సినిమాతో హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మహేష్ బాబు నటించిన మొదటి చిత్రం అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘వంశీ’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నమ్రత నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

అయితే మహేష్ బాబు- నమ్రత వివాహానికి మొదటగా కృష్ణ ఒప్పుకోలేదంట. ఎందుకంటే అప్పట్లో హీరోలకు కులం పరంగా అభిమానులు ఎక్కువగా ఉండేవారు. వారి అభిమాన హీరో కొడుకు ఇలా ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎం అనుకుంటారో అని కృష్ణ వీరి వివాహానికి ససేమీరా వద్దన్నారు. ఆ తర్వాత మహేష్ బాబు.. కృష్ణను ఒప్పించుకొని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్యలో జరిపించారు. మహేష్ బాబు- నమ్రతల వివాహానికి అయినా మొత్తం ఖర్చు కేవలం రూ.10,000 మాత్రమే.

వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నమత్ర సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటున్నారు. మహేష్ బాబు మాత్రం పెళ్లి చేసుకున్నప్పుడు ఇండస్ట్రీకి మూడు సంవత్సరాలు విరామం ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి విజయాల్ని సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తూనే ఫ్యామిలీకి కూడా టైం కేటాయిస్తూ వస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -