Mahesh: మహేష్ రెస్టారెంట్ ఆదాయం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Mahesh: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు వ్యాపార రంగాల్లో దూసుకెళ్తున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ.. బిజినెస్‌లోనూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే థియేటర్లు, క్లాతింగ్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు. రీసెంట్‌గా భార్య నమ్రత పేరుతో ఓ రెస్టారెంట్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఈ రెస్టారెంట్‌కు ‘ఏఎన్’ నామకరణం చేశారు. ఏ అంటే ఏషియన్స్ అని, ఎన్ అంటే నమ్రత అని అర్థం. ఇప్పటికే ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో కలిసి మహేశ్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు. తాజాగా ఏషియన్‌తో కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేశారు.

 

 

రెస్టారెంట్ లుక్, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డిజైనింగ్, ఫర్నీచర్.. మొత్తానికి ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. అలాగే ఈ రెస్టారెంట్ రేట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టిఫిన్స్ రేట్స్ ఆకాశాన్నంటాయి. ఇడ్లీ రూ.90 నుంచి మొదలై రూ.120 వరకు ఉన్నాయి. ప్లేట్ పూరీ రూ.170, దోశ రూ.120 నుంచి మొదలుకొని రూ.250 వరకు కొనసాగుతున్నాయి. దాంతో ఈ రెస్టారెంట్ ధరలు దారుణంగా ఉన్నాయని సోషల్ మీడియాలో భారీగానే ట్రోలింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ రెస్టారెంట్ ద్వారా మహేష్ బాబుకు రూ.కోట్లలో లాభాలు వస్తున్నాయని సమాచారం. జనాలు ఈ రెస్టారెండ్ రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే లాభాలు ఆ రేంజ్‌లో వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

 

 

ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. జనవరిలో షూటింగ్ ప్రారంభించి.. మార్చి నెలాఖరులోగా సింగిల్ షెడ్యూల్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల, శోభన నటించే అవకాశం ఉంది. రామ్ లక్ష్మణ్‌లు ఫైట్ మాస్టర్లుగా ఉండనున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -