Mahesh: మహేష్ గ్లామర్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.. ఏం అందమంటూ?

Mahesh: టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన అందం. ఐదు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడి లాగా కనిపిస్తూ అమ్మాయిల కళ్ళు రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు. వయసు పెరుగుతున్న కూడా అందం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే వయసుతోపాటు అందం మరింత పెరుగుతుంది అని చెప్పవచ్చు.

ప్రస్తుతం మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి ఒక వేడుకలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ఫన్ నైట్ అని క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చారు. అయితే ఆ ఫోటోలో మహేష్ బాబు లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు అబ్బా ఏమి అందం. అందం తింటున్నావా లేక అన్నం తింటున్నావా మహేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సూపర్ అన్న సో క్యూట్, మిల్కీ బాయ్ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

 

ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందునున్న సినిమాలు నటించనున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -