Mahesh: ఊరమాస్ పాత్రలో మహేష్.. నెక్స్ట్ లెవెల్ స్టోరీ అంటూ?

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రెండు సినిమాలకు సైన్ చేశారు. అందులో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా కాగా మరొకటి దర్శక ధీరుడు రాజమౌళిది. అయితే మొదటగా త్రివిక్రమ్ సినిమాను మహేష్ బాబు పూర్తి చేసే పనిలో పడ్డాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా సాగుతూనే ఉంది. అందుకే ఈ సినిమాకు కొంత గ్యాప్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు అన్నీ సెట్ అయినట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని రోజులకు ముందు కూడా ఒక అప్ డేట్ వచ్చింది.

 

తాజాాగా చిత్ర యూనిట్ సినిమా గురించి ఓ అప్ డేట్ అనేది ఇచ్చింది. అంతులేని ఉత్సాహంతో తాము షూటింగ్ కు వెళ్లబోతున్నట్లు తెలిపింది. జనవరి నెల నుంచి ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ వర్క్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్లు జనవరిలోనే తెలియనున్నాయి.

 

ఈ మధ్యనే త్రివిక్రమ్, మహేష్ బాబు తాము కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేయగా అందులో నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్ కూడా ఉండటం గమనించవచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కనిపించనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబుకి ఇది హ్యాట్రిక్ సినిమా అని చెప్పొచ్చు. గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. త్రివిక్రమ్ చివరగా అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం సినిమా చేశారు.

 

అయితే దర్శకధీరుడు రాజమౌళి చిత్రానికి ముందు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేయనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి రాజమౌళి చిత్రానికి వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబుకు విభిన్నమైన గెటప్ ఉందని, అది ఫ్యాన్స్ కు ఎంతగానో కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీలో 100 మందితో మహేష్ ఫైట్ ఉండనుందని యాక్షన్ ఎపిసోడ్స్ లో న భూతో న భవిష్యత్ అనే విధంగా ఈ ఎపిసోడ్ ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -