Mahesh: మహేష్ విగ్గుపై కృష్ణ మేకప్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Mahesh: టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నా.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడని చెప్పుకునే ఏకైక హీరో మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో విపరీతమైన మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు.

 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూనే ఉంటారు. హీరో అంటే మహేష్ లా ఉండాలని.. ఆయనంత అందం, ఎత్తు, రూపం ఉండాలని ఉదాహరణగా చెబుతుంటారు. అయితే మహేష్ బాబు సినిమాల కోసం విగ్గు పెట్టుకున్నారనే వార్తలు చాలాకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

తన అన్న రమేష్ బాబుతో దిగిన ఓ ఫోటోలో మహేష్ బాబుకు బట్టతల ఉన్నట్లు కూడా కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే అది మార్ఫింగ్ వీడియో అని మహేష్ బాబు ఫ్యాన్స్ దానిని ఖండించారు. కాగా తాజాగా కృష్ణ మేకప్ మ్యాన్ దీని గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుకు మొదట మేకప్ వేసింది తానే అని చెప్పిన ఆయన.. అసలు విషయం చెప్పాడు.

మహేష్ బాబుకు జట్టు కొద్దిగా పల్చబడిందని.. అందుకే విగ్ తో మేనేజ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో గతంలో మహేష్ బాబు బట్టతల ఫోటోలు నిజమో కానీ తెలియదు కానీ ఆయన విగ్ వాడుతున్నాడనే వార్త మాత్రం నిజమే అని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. మొత్తానికి విగ్ వాడినా కానీ మహేష్ బాబుకి అందంలో ఎవరూ సరిరారు అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts