Jr NTR: ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే?

Jr NTR: నందమూరి వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. నటనలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్, డెడికేషన్ కలిగిన ఈ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. తాజాగా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ చేసిన ‘కొమురం భీముడో కొమురం భీముడో’ పాటకు ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటూ ఆ మధ్య డిమాండ్ వినిపించడం తెలిసిందే.

రాజమౌళితో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టి, ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘ఆర్ఆర్ఆర్’తో వేరే లెవల్ నటనకు ప్రాణం పోసిన ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. నటుడు, ఫన్ బకెట్ ఫేం మహేశ్ విట్టా తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టం అని, ఆయన గురించి అప్ డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానని తెలిపాడు.

ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పమని యాంకర్ కోరగా.. ‘ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. ఆయన చాలా రోజులు హైదరాబాద్ పాతబస్తీలో ఉండటం వల్ల ఆయనకు ఉర్దూ బాగా వస్తుంది. నేటివ్ ఉర్దూ మాట్లాడే వారి కన్నా అద్భుతంగా ఉర్దూ మాట్లాడగలరు. అందుకు తగ్గట్టు క్యారెక్టర్ వచ్చిందంటే ఎన్టీఆర్ కుమ్మేస్తాడు’ అని తెలిపాడు.

ఎన్టీఆర్ కి సంబంధించి మహేశ్ విట్టాకు ఎవరు అప్ డేట్స్ ఇస్తున్నారని యాంకర్ ప్రశ్నిస్తే.. ‘అవి చెప్తే చంపేస్తారు. ఇక అప్ డేట్స్ ఏమీ రావు. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటా’ అని వివరించాడు. కాగా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ హిట్ తర్వాత జాతీయ మీడియాలో కూడా అనర్గళంగా హిందీలో ఇరగదీయడం అందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YV Subba Reddy: వైసీపీలో చేతులు దులిపేసుకున్న వైవీ సుబ్బారెడ్డి.. వాళ్లు అసలు అభ్యర్థులే కాదంటూ?

YV Subba Reddy: వైయస్సార్సీపి పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి వారిలో వైవి సుబ్బారెడ్డి ఒకరు. ఈయన పార్టీలో ఎంతో చురుగ్గా ఉంటూ పార్టీకి ఎలాంటి మేలు చేశారో తెలియదు కానీ ఈయన...
- Advertisement -
- Advertisement -