Ponniyin Selvan1: పొన్నియన్ సెల్వన్ సినిమాలో మొదట ఆఫర్ వచ్చింది మహేష్ బాబుకే.. పాత్ర ఏంటంటే!

Ponniyin Selvan1: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పెద్దగా పరిచయ అకర్లేదు. రాజకుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టిన మహేష్ ఆ తర్వాత పలు సినిమాలో నటించి తెలుగు నాట నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు అభిమానుల గురుంచి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అందుకుంటూ అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు.

ఇక మహేష్ బాబు లోని ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం మహేష్ బాబు సొంతం. ఇదంతా పక్కన పెడితే కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తరికెక్కించిన సినిమా పొన్నియన్ సెల్వన్. కాగా ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్ , హీరో కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష లు ప్రధాన పాత్రను పోషించారు.

కాగా ఈ సినిమాను కొలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాను కోలీవుడ్ మీడియా బాహుబలి రేంజ్ లో ప్రచారం చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్ ల విషయంలో బాహుబలిని దాటేస్తుంది అని చాలామంది కొలీవుడ్ ప్రేక్షకులు మరో స్థాయిలో ప్రచారం చేశారు.

అయితే ఐదేళ్ల క్రితం మణిరత్నం ఈ సినిమాలో వేరే తారగానంతో చేయాలి అనుకున్నాడట. అప్పటి కాస్ట్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడట. జయం రవి రోల్ ను ముందుగా మహేష్ బాబుకి ఇచ్చారట. హీరో కార్తీ పాత్రను తళపతి విజయ్‌ చేశారన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసిన మహేష్ బాబు అభిమానులు జయం రవి పాత్రలో మహేష్ బాబు ఉంటే ఏ విధంగా ఉంటాడో అని ఊహించు కుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -