Mahesh Babu: మరోసారి గొప్ప మనసుని చాటుకున్న మహేష్.. చిన్నారి ప్రాణాలు కాపాడి?

Mahesh Babu: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు హీరోగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి తనకంటూ ఒక ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకున్నారు మహేష్ బాబు. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్. వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి రియల్ లైఫ్ హీరోగా అనిపించుకున్నాడు.

ఎంతోమందికి ప్రాణదానం చేశాడు మహేష్ బాబు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ బాబు. ఇక సమయం దొరికినప్పుడల్లా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సహాయం అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ మంచి వ్యక్తి గొప్ప వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్. గుండె జబ్బులతో పోరాడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించి ఆ తల్లిదండ్రుల జీవితాల్లో సంతోషాన్ని నింపారు. ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది పసి హృదయాలను బ్రతికిస్తున్నారు.

 

తాజాగా మరో రెండేళ్ల బాలుడికి ఉచితంగా గుండె సర్జరీ చేయించి మంచి మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన కార్తికేయ అనే రెండేళ్లు చిన్నారి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు చికిత్స కోసం ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడికి హార్ట్ లో రంద్రం ఉన్నట్లు నిర్దారించారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యరు. పేదరికంతో బాధపడుతున్న వారికి ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. దాంతో సమయంలో ఇరుగుపొరుగు వారి సహాయంతో మహేష్ బాబు ఫౌండేషన్ గురించి తెలుసుకున్నారు. వెంటనే బాలుడిని తీసుకుని వెళ్లి ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో బాలుడికి హార్ట్ ఆపరేషన్ చేసి ప్రాణాలను నిలబెట్టారు. వైద్యుల పర్యవేక్షణ అనంతరం బాలుడిని డిశ్చార్జ్ చేసినట్లు తల్లిదండ్రలు వెల్లడించారు. పూర్తి ఉచితంగా గుండె ఆపరేషన్ చేసి తమ కొడుకు ప్రాణాలను నిలిపినందుకు ఆ తల్లిదండ్రులు మహేష్ బాబు ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇది చూసిన అభిమానులు మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ మహేష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -