Pushpa 2: పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

Pushpa 2: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణసొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈసారి పుష్ప సినిమాని మించి ఉండాలన్న ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం భారీగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ విడుదల చేశారు.

 

పుష్ప సినిమాలోని చివరిలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహద్ పాజిల్ నటించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఒక్కటి తక్కువైంది పుష్ప అన్న డైలాగ్ తో ఈ పాత్ర చాలా హైలెట్ అయింది అయితే సీక్వెల్ చిత్రంలో ఈయన పాత్రనిడివి చాలా ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్లో ఇప్పటికే పాల్గొన్నారని తెలుస్తోంది. తాజాగా ఈయనపై చిత్రీకరించాల్సిన కీలక సన్నివేశాలను పూర్తి చేశారని సమాచారం.

 

భన్వర్ సింగ్ షెకావత్ తో కీలకమైన షెడ్యూల్ పూర్తయిందని, ఈసారి షెకావత్ పాత్ర పగతో రగిలిపోతుందంటూ హింట్ కూడా ఇచ్చారు. ఈ మేరకు ఒక వర్కింగ్ స్టిల్ కూడా విడుదల చేయడంతో ఇందులో ఫహద్ చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పుష్ప సీక్వెల్ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -