Mamta Mohandas: మమతా మోహన్ దాస్ కు క్యాన్సర్, భర్త దూరం.. చివరకు?

Mamta Mohandas: సినీ రంగంలోని వారందరిదీ ఎంతో అందమైన, అద్భుతమైన జీవితం అని చాలామంది అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. చాలామంది ఆర్టిస్టులు, సినిమా రంగానికి చెందిన వారి జీవితాల్లో ఎన్నో విషాదాలు ఉంటాయి. కానీ వారు వాటన్నింటిని దిగమింగి కెమెరా ముందు మాత్రం నవ్వుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇలాంటి విషాదాన్ని కలిగిన హీరోయిన్ మమతా మోహన్ దాస్.

 

తెలుగులో పలు సినిమాలు చేసిన మమతా మోహన్ దాస్ జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఆమెను కేవలం సినిమాల్లో చూసిన వాళ్లంతా తన జీవితం ఎంతో బాగుందని అనుకుంటారు. కానీ ఆమె వ్యక్తిగత జీవితం ఎంతో దుర్భరంగా గడపింది. ఒకానొక స్థితిలో తన అనుకునే వాళ్లు ఎవరూ లేని స్థితి నుండి పోరాడి బయటపడింది. కట్టుకున్న వాడు కూడా వదిలేసిన మమతా మోహన్ దాస్ జీవితం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడైంది.

 

 

మమతా మోహన్ దాస్ 2009లో హాడ్కిన్ లింఫోమో అనే క్యాన్సర్ బారిన పడింది. దీంతో వైద్యులు ఆమెకు 2013లో బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు అది ఫెయిల్ అవడంతో ఆమె మరోసారి క్యాన్సర్ బారినపడింది. ఆ తర్వాత 2016లో FDI ఆమోదంతో నివొలుమాబ్ మెడిసిన్ అందుబాటులోకి రావడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది.

 

తాజాగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు తాను పడ్డ నరకం గురించి వివరించిన మమతా మోహన్ దాస్.. తన భర్త కూడా తనను వదిలివెళ్లినట్లు పేర్కొంది. ఇలా తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్నీ అనుభవించానని ఆమె చెప్పింది. తన జీవితంలో ఏడేళ్ల పాటు సుదీర్ఘకాలం క్యాన్సర్ తో పోరాడినట్లు మమతా మోహన్ దాస్ వివరిస్తూ బాధపడింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -